బీజేపీ, మోడీ హవా కొనసాగుతుంది. అమిత్ షా ప్రణాళికలు, మోదీ చతురతతో అన్ని రకాల ఎన్నికల్లో బీజేపీ తన ఆదిపత్యం చూపిస్తుంది. చివరకు యూపీలో కూడా తనకు తిరుగులేదని నిరూపించింది. ఇక దక్షిణ భారతదేశంలో తన ప్రాబల్యం చాటుకోవాలని ఆశిస్తుంది. ఈ మేరకు వేగంగా పావులు కదువుతుంది. కర్నాటక ఎన్నికలను దీనికి ప్రామాణికంగా తీసుకుంది. ఇక్కడ గెలవగానే తెలంగాణ, ఏపీ, తమిళనాడులో పార్టీని విస్తరించాలని భావిస్తోంది. ఈ మేరకు స్కెచ్ రెఢీ చేసింది. ఈ మేరకు పార్టీ నేతలకు సూచనలు ఇస్తుంది. జనసేన పార్టీతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీనీ స్థాపించిన తరువాత బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేశారు. ఏపీ ప్రత్యేక స్టేటస్ పై పవన్ రెండు పార్టీలతో తెగ తెంపులు చేసుకున్నారు.బీజేపీని బహిరంగంగానే విమర్శలు చేశారు. లోపాయికార ఒప్పందం మేరకు పవన్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పవన్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మిగతా చిత్ర సీమ బీజేపీ అనుకూలంగా పనిచేయడానికి ఇంత వరకు ఎవరు సంసిద్దత వ్యక్తం చేయలేదు. విలక్షన నటుడిగా పేరొందిన ప్రకాశ్ రాజ్ ఇప్పటికే బీజేపీపై యుద్దం ప్రకటించారు. సీనియర్ నటుడు కమల్‌హాసన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సొంతంగా పార్టీని స్థాపించారు. మొదట్లో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కాని చివరకు సొంతంగా పార్టీ పెట్టారు. బీజేపీ తో కలిసి పనిచేయనున్నట్టు ఆయన ఇంత వరకు ఎక్కడా ప్రకటించలేదు. సో దక్షిణాది చిత్ర పరిశ్రమ బీజేపీతో పనిచేయడానికి సిద్దం లేదనేది ప్రస్తుత ఇండస్ట్రీ టాక్. అయితే దక్షిణాన మాత్రం సినిమా నటులు బీజేపీకి వ్యతిరేకం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన సినీ పరిశ్రమ బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.