YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గురువారం నుంచి ఊరురా వైఎస్సార్ జెండా పండుగ

గురువారం నుంచి ఊరురా వైఎస్సార్ జెండా పండుగ

గురువారం నుంచి ఊరురా వైఎస్సార్ జెండా పండుగ
హైదరాబాద్
రాజన్న యాదిలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరియు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు "ఊరూరా వైయస్ఆర్ జెండా పండుగ" నిర్వహించాలని వైఎస్సార్  తెలంగాణ పార్టీ అధినానేత  వైయస్ షర్మిల  నిర్ణయించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ జెండా పండుగ నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. గ్రామాలు, మండలకేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో YSR తెలంగాణ పార్టీ జెండాలు ఆవిష్కరించాలని కోరారు.
పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం:
ఆగస్టు 5వ తేదీన గురువారం వైయస్ షర్మిల  పార్లమెంటరీ కన్వీనర్, కో-కన్వీనర్లతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించి, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త కమిటీ సభ్యులకు పార్టీ బలోపేతంపై సలహాలు ఇవ్వనున్నారు. వైయస్ఆర్ సంక్షేమ పాలనను ప్రతీ గడపకూ చేరవేసేలా నాయకులకు సూచనలు చేయనున్నారు.  వైయస్ఆర్ స్వర్ణయుగ పాలన తిరిగి తెచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, మహమ్మద్ ముస్తబా, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts