YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం: కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం: కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం: కేటీఆర్
హైద‌రాబాద్ ఆగష్టు 4
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను  కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు వారికి త‌ప్ప‌కుండా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని టీఆర్ఎస్ పార్టీ  తెలిపారు.. తెలంగాణ‌లో 60 ల‌క్ష‌ల పైచిలుకు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిగిన అజేయ‌మైన శ‌క్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగింది.వివిధ ప్ర‌మాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 80 మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల బీమా సాయం అందించి, వారిలో మ‌నో ధైర్యాన్ని నింపారు. ఆ కుటుంబాల‌తో క‌లిసి కేటీఆర్ లంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ భ‌వ‌న్‌కు వ‌చ్చిన 80 మంది కుటుంబ స‌భ్యుల‌కు హృద‌య‌పూర్వక న‌మ‌స్కారాలు. మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భ‌ర్త‌, సోద‌రుడు, కుమారుడు ఎవ‌రైనా కావొచ్చు… వివిధ ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించారు. అలాంటి కుటుంబాల‌కు పార్టీ అండ‌గా ఉంటుంది. కేసీఆర్ అండ‌గా ఉంటున్నారు. ఈ కుటుంబాల స్థితిగ‌తుల‌ను పార్టీ నాయ‌కులు అడిగి తెలుసుకున్నారు. మాకు ఇల్లు లేదు అని కొంత‌మంది.. పిల్ల‌లు చిన్న‌వారు ఉన్నారు.. గురుకులాల్లో అడ్మిష‌న్స్ క‌ల్పించాల‌ని కోరారు. చ‌ద‌వుకున్న అమ్మాయిలు ఉన్నారు.. త‌మ‌కేదైనా ఉద్యోగం ఇప్పించాల‌ని కోరారు. చ‌నిపోయిన త‌ర్వాత పెన్ష‌న్ రావ‌ట్లేద‌ని తెలిపారు. మీ అంద‌రికీ తాము అండ‌గా ఉన్నాం. రాబోయే ప‌దిహేను రోజుల్లో మీరు అడిగిన ప‌నులు చేసిపెట్టే బాధ్య‌త త‌మ‌దే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.18 కోట్ల పైచిలుకు రూపాయాల‌ను ఇన్సూరెన్స్ క‌డుతున్నామ‌ని చెప్పారు. 950 మంది పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వివిధ ప్ర‌మాదాల్లో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ కుటుంబాల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్య‌త పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీల‌తో పాటు ఎమ్మెల్యేలదే అని తెలిపారు. వీరంద‌రికి త్వ‌ర‌లోనే సాయం చేస్తామ‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌నంద‌రం ముందుకు పోదామ‌ని పిలుపునిచ్చారు. వారం ప‌ది రోజుల్లోనే పిలిచి.. మీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

Related Posts