YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

టోక్యోలో లవ్లీనా కు మరో పతకం

టోక్యోలో లవ్లీనా కు మరో పతకం

టోక్యోలో లవ్లీనా కు మరో పతకం
టోక్యో, ఆగస్టు 4, 
టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సర్ లవ్లీనా భారత్‌కి కాంస్య పతకాన్ని అందించింది. మహిళల 69 కేజీల విభాగంలో పోటీపడిన లవ్లీనా బుధవారం సెమీస్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ బుసానెజ్ చేతిలో పేలవంగా ఓడిపోయింది. టర్కీకి చెందిన బుసానెజ్‌కి ఏ దశలోనూ లవ్లీనాకి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. దాంతో.. 0-5 తేడాతో ఓడిన లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇప్పటికే వెయిల్‌లిప్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.వాస్తవానికి బుసానెజ్‌పై లవ్లీనాకి గెలుపు రికార్డ్ లేదు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఈ టర్కీ బాక్సర్‌తో తలపడిన లవ్లీనా.. అన్ని సార్లూ పరాజయాన్ని చవిచూసింది. అయితే.. క్వార్టర్‌ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్‌ చిన్ చెన్‌ని ఓడించిన లవ్లీనా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈరోజు బౌట్‌కి ముందు కనిపించింది. కానీ.. సెమీస్ పోరులో బుసానెజ్‌‌కి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఒలింపిక్స్‌ చరిత్రలో ఇప్పటి వరకూ ముగ్గురు బాక్సర్లు మాత్రమే భారత్‌కి పతకాలు అందించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ కాంస్య పతకం గెలుపొందగా.., 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీకోమ్ కూడా కాంస్యం గెలిచింది. తాజాగా లవ్లీనా వీరి సరసన కాంస్యంతో నిలిచింది.అస్సాంలోని గోల్‌ఘాట్ జిల్లాలో ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన లవ్లీనా.. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ విఫలమైన చోట భారత జెండాని రెపరెపలాడించింది. దాంతో.. ఇప్పుడు ఆమె గ్రామం బరోముతియాకి ప్రభుత్వం తారు రోడ్డు వేయిస్తోంది. దాదాపు 3.5కిమీ మట్టి రోడ్డుని అక్కడి ఎమ్మెల్యే బిశ్వజిత్ పర్యవేక్షణలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ తారు రోడ్డుగా మారుస్తోంది.
జూవెలిన్ త్రోలో భారత్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌కి చేరాడు. బుధవారం జరిగిన గ్రూప్-ఎ క్వాలిఫికేషన్‌‌లో జావెలిన్‌ని 86.65 మీటర్లు విసిరిన నీరజ్ జోప్రా.. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి అర్హత సాధించిన తొలి భారత జావెలిన్ త్రోయర్‌గా అరుదైన ఘనత సాధించాడు. మొదటి ప్రయత్నంలో జావెలిన్‌ని 86.65 మీటర్లు విసరడం ద్వారా ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకున్నాడు. గ్రూప్-ఎలో చోప్రానే టాప్‌లో నిలిచాడు.ఇది నాకు ఫస్ట్ ఒలింపిక్స్. వార్మప్‌లో నా ప్రదర్శన మెరుగ్గా లేదు. కానీ.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే త్రో బాగా కుదిరింది. అయితే.. ఫైనల్లో ఫీలింగ్ భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే.. వరల్డ్ అత్యుత్తమ జావెలిన్ త్రోయర్‌లు అక్కడ ఉంటారు. కాబట్టి.. ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఫైనల్లో హై స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తా’’ అని నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 83.50మీ మార్క్‌ని అందుకున్న జావెలిన్ త్రోయర్లు, టాప్-12లో నిలిచిన త్రోయర్లు ఫైనల్‌కి అర్హత సాధించనున్నారు. పతకాల కోసం ఫైనల్ పోరు శనివారం జరగనుంది. హర్యానాకి చెందిన నీరజ్ చోప్రా ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో..? చూడాలి. నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 88.07మీ.. 2021, మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ఫ్రిక్స్ 3లో ఈ త్రో విసిరాడు.
రెజ్లింగ్ లో మరో పతకం ఖాయం
ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం చేశాడు రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా. బుధ‌వారం జ‌రిగిన‌ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌పై అత‌డు గెలిచాడు. విక్ట‌రీ బై ఫాల్‌గా అత‌న్ని విజేత‌గా ప్ర‌క‌టించారు. ఈ విజ‌యంతో ఫైన‌ల్లో అడుగుపెట్టిన ర‌వికుమార్‌.. ఇండియాకు క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్‌, యోగేశ్వ‌ర్‌ద‌త్‌లు మాత్ర‌మే ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్స్ అందించారు. వాళ్ల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన మూడో రెజ్ల‌ర్‌గా ర‌వికుమార్ ద‌హియా నిలిచాడు.బుధ‌వారం ఉద‌యం నుంచి ర‌వికుమార్ మొత్తం బౌట్లు గెలిచి మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా.. అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు.బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన తొలి బౌట్‌లో ర‌వికుమార్ ద‌హియా.. కొలంబియా రెజ్ల‌ర్ టైగ్రెరోస్ అర్బానోపై 13-2తో ఈజీగా గెలిచి క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత క్వార్ట‌ర్స్‌లో బ‌ల్గేరియాకు చెందిన జార్జి వ‌లెంటినోవ్‌పై 14-4 తేడాతో విజ‌యం సాధించాడు. ఇక సెమీఫైన‌ల్లోనూ స‌త్తా చాటి ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. గెలిస్తే గోల్డ్ మెడ‌ల్ సాధించిన తొలి ఇండియ‌న్ రెజ్ల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. లేదంటే క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ అయితే ప‌క్కాగా తీసుకురానున్నాడు.

Related Posts