YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

కోర్టు ధిక్కరణల కోసం 58 కోట్లా : హైకోర్టు ఆశ్చర్యం

కోర్టు ధిక్కరణల కోసం 58 కోట్లా : హైకోర్టు ఆశ్చర్యం

 కోర్టు ధిక్కరణల కోసం 58 కోట్లా : హైకోర్టు ఆశ్చర్యం
హైదరాబాద్, ఆగస్టు 4, 
కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఓ లెక్చరర్‌ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, న్యాయమూర్తి విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58కోట్లు మంజూరు చేయడమేంటని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.కోర్టు ధిక్కరణ కేసు విచారణ ఖర్చుల కోసం..నిధులు విడుదల చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58కోట్లు మంజూరు చేయడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని, ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శులతో పాటు సీసీఎల్‌ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 27కి వాయిదా వేసింది.

Related Posts