లక్ష పది వేల విలువ గల గుట్కా అంబర్ ప్యాకెట్ల పట్టివేత
ములుగు ఆగస్టు 04
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రం సమీపంలోని కొత్తపల్లి కిరాణా షాపులొ బుధవారం రూ.లక్షా పది వేల విలువ చేసేప్రభుత్వ నిషేధిత గుట్కా అంబర్లను పట్టుకున్నట్లు గణపురం శిక్షణ ఎస్సై బి మాధవ్ తెలిపారు.ఆయన కథనం ప్రకారం కొత్తపల్లి గ్రామంలో కిరాణం నడుపుతున్న రేండ్ల.నరేష్ దుకాణంలో పక్కా సమాచారంతో దాడులు చేయగా దుకాణంలో 94 జేకే తంబాకు 200అంబర్ ప్యాకెట్లు,5000 తంబాకు 1,10,000 విలువ చేసే నిల్వ ఉన్న గుట్కా అంబర్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.వీటి విలువ లక్షా పది వేలు ఉంటుందని స్వాధీనం చేసుకున్న గుట్కా అంబర్ ప్యాకెట్లను పోలీస్ స్టేషన్ కు తరలించి నరేష్ పై కేసు నమోదు చేసినట్టు మాధవ్ వివరించారు.ఈ దాడుల్లో సిబ్బంది రాజేందర్,సాంబయ్య,సందీప్ లు పాల్గొన్నారు.