తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న డి ఎం హెచ్ ఓ
నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో బుధవారం డి. ఎం. హెచ్. ఓ రాజ్యలక్ష్మి పి మరియు ఐ.సి.డి.ఎస్ అధికారుల సమక్షంలో తల్లిపాలు వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉదయం రాజు లక్ష్మి పాల్గొన్నారు. తల్లిపాలు విశిష్టత గురించి స్థానిక మహిళలకు పూర్తి స్థాయిలో వివరించారు. తల్లిపాలు కనీసం ఈ సంవత్సరం పాటు తాగిన శిశువుల్లో అత్యధిక శాతం వ్యాధి నివారణ శక్తి కలిగి ఉంటుంది అన్నారు. కానీ ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా అనేక మంది మహిళలు తమ పిల్లలకు డబ్బా పాలు తాగే అలవాటు చేస్తున్నారని ఇది సరైన అలవాటు కాదన్నారు. పిల్లలు సరైన ఎదుగుదల పోషణ అందాలంటే తల్లిపాలు తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 28 వ డివిజన్ వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ చక్కా సాయి సునీల్ మరియు డాక్టర్ ప్రశాంత్, శిల్ప, ఏ ఎం నేమ్స్ సుధా, సుభాషిని, శ్రీలక్ష్మి, ఆశ వర్కర్ ఆశ, రజిని, అంగన్వాడీ టీచర్స్ రవణమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు.