YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మెడికల్ కళాశాల అనువైన స్థలంలో ఏర్పాటు చేయాలి 35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి

మెడికల్ కళాశాల అనువైన స్థలంలో ఏర్పాటు చేయాలి 35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి

మెడికల్ కళాశాల అనువైన స్థలంలో ఏర్పాటు చేయాలి
35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కి లేఖ
జగిత్యాల ఆగస్టు 04
జగిత్యాల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల,  మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు అనువైన స్థలంలో ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు పట్టణానికి చెందిన 35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ వ్రాసారు .జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ కు సంబంధించి నిర్మాణాలు చేయుటకు స్థల సేకరణలో భాగంగా ధరూర్ క్యాంపులోని ఎస్ఆర్ఎస్పీ స్థలాలను అధికారులు పరిశీలన చేసి, నివేదిక పంపినట్లు ఓ దిన పత్రికల ద్వారా తేలిసిందని ,జగిత్యాల పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి 69 సంవత్సరాలు అవుతుందని, ఇప్పటికి ఇక్కడ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు కాలేదని,ఎస్ఆర్ఎస్పీ స్థలంలో జిల్లా కలెక్టరేట్,జిల్లా పోలీస్ కార్యాలయం,ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తోపాటు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలకు సంబంధించిన నివాస గృహాలు నిర్మించబడ్డాయిని ,అలాగే ఇక్కడ ప్రజలు నివాసం నిమిత్తం చాల పెద్ద మొత్తంలో గృహ నిర్మాణాలు చేసుకున్నారని,ధరూర్ నివాసయోగ్య మైన స్థలం ఆని ,జగిత్యాల పట్టణానికి సంబంధించి అభివృద్దికి అనుకూలమైన స్థలాలు నిజామాబాద్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, ధర్మపురి రోడ్డు మరియు గొల్లపెల్లి రోడ్డు లలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయిని. కరీంనగర్ రోడ్డులో ఇప్పటికే అభివృద్ధి జరిగిందని,నిజామాబాద్ రోడ్డులో చల్ గల్ వరకు మామిడి మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల పట్టణ అభివృద్ధి కొంతమేర చేసుకోన్నుమని కాని ధర్మపురి రోడ్డు వైపు ఎటువంటి అభివృద్ధి జరుగలేదని , ధర్మపురి రోడ్డులో రోడ్డుకు ఆనుకొనే కొన్ని వందల ఏకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయిని,అలాగే గొల్లపల్లి రోడ్డులో జాబితాపూర్ వద్ద రోడ్డుకు అనుకునే 600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కావున, ధర్మపురిరోడ్డులో కాని గొల్లపెల్లి రోడ్డులో కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసినట్లయితే జగిత్యాల పట్టణ అభివృద్ది జరుగుతుందని మెడికల్ కళాశాల, హాస్పిటల్ ధరూర్ ఎస్ఆర్ఎస్పీ స్థలంలోఅనుకూలంగా అధికారులు ఆమోదం తెల్పినట్లు ప్రచారం జరుగుతోంది,
ధరూర్ ఎస్ఆర్ఎస్పీ పెద్దమొత్తంలో ఒకే స్థలంలో 60 ఎకరాల స్థలం అందుబాటులో లేదని, కేవలం చిన్న చిన్న మొత్తంలో స్థలాలను 4,5 స్థలాలలో విడివిడిగా ఏర్పాటు చేయడానికి ప్రదేశాలు గుర్తించినట్లు తెలిసిందని ,ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ మరియుప్రభుత్వ కార్యాలయాలు ఒకే స్థలంలో నిర్మించడానికి అవకాశాలు లేవని, మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ ఏర్పాటు చేయడంప్రభుత్వ కార్యాలయలకు మరియు చుట్టు నివసించే ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని , పట్టణంలోని ప్రజల మరియు మేదావి వర్గం, విద్యార్థుల మనోభావాలను కూడ పరిగణలోకి తీసుకోని జిల్లా కలెక్టర్, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధి కారులు, ట్రాఫిక్ అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి నివేదిక తీసుకొని అనువైన స్థలంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ జయశ్రీ ముఖ్యమంత్రి కి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.

Related Posts