విశాఖపై రాజకీయంగా పట్టు సాధించేందుకు దాదాపు అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇక్కడ మాత్రం.. టీడీపీ, కాంగ్రెస్‌తో పోల్చితే. వైసీపీయే కాస్త ముందంజలో ఉండాలనేమో. వైసీపీలో జగన్ తరువాత అంతటి స్థానం.. ఎందుకంటే.. నెంబరు 2 అంటే.. ఆయనకు నచ్చదు. ఎందుకంటే.. జగన్ అక్రమాస్తుల కేసులో. ఏ2గా విజయసాయిరెడ్డి పేరే ఉంది. అందుకే.. ఎవరైనా టూ అంటే.. ఆయనకు తిక్కరేగుతుందట. ఢిల్లీలో పెద్దన్నగా ఉంటూ.. చక్రం తిప్పుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ హయాంలో హీరోలా ఎదిగిన జేడీ… ఇప్పుడు.. సైలెంట్‌గా పొలిటికల్ ఎంట్రీకు రెడీ అవ్వటానికి కారణాలు.. వెతికే పనిలో ప్రత్యర్థులు రెడీ అయ్యారట. ఇవన్నీ పక్కనబెడితే.. విశాఖ తీరంలో పాగా వేయాలని భావించిన వైసీపీ 2014లో ఊహించని విధంగా భంగపాటు చవిచూసింది. వైఎస్సార్ సతీమణి విజయమ్మను పార్లమెంట్ అభ్యర్థిగా నిలిపినా.. గెలవలేకపోయారు. పైగా.. వైఎస్ సాధించిన ప్రతిష్ఠను ఒక్కదెబ్బతో తీశారంటూ వైసీపీ అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. రాయలసీమ నుంచి వచ్చిన ఆమెను.. నాన్‌లోకల్‌గానే జనం భావించారు. పైగా హరిబాబు లోకల్ అనేది బాగా పనిచేసింది. గతంలో నెల్లూరు నుంచి సుబ్బిరామిరెడ్డి, నేదురమల్లి జనార్దన్‌రెడ్డి నాన్‌లోకల్ అయినా గెలిపించిన విశాఖ వాసులు.. జగన్ విషయంలో ఝలక్ ఇచ్చారు. దీంతో ఈ సారి పరువు కాపాడుకోవటమే కాదు.. పోయిన ప్రతిష్ఠను రాబట్టుకునేందుకు ఏకంగా విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. విశాఖలో ఆఫీసు తెరిచారు. ఉత్తరాంధ్ర హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. చంటి లోకల్ అన్నట్టు.. విజయసాయి కూడా లోకలే అనే బిల్డప్ ఇచ్చే పనిలో పడ్డారు. అసలే.. గోదారి నీళ్లు తాగేవాళ్లు.. రాజకీయంగా చైతన్యవంతమైన విశాఖ ఓటర్లు.. 2019లో తీర్పు ఎలా ఇస్తారో.. విజయమ్మ స్థానంలో వచ్చిన విజయసాయిని నెత్తిన పెట్టుకుంటారా! తన్ని తగలేస్తారా! పైగా.. జగన్‌పై మోపిన అభియోగాలు.. కేసులు ఒక్కోకటీ సీబీఐ కొట్టేస్తుంది.ఇదంతా రాజకీయంగా పెట్టిన కేసులు.. సాక్ష్యాల్లేవంటూ యంత్రాంగం చేతులెత్తేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆ కేసు దర్యాప్తు చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ అధికారి లక్ష్మినారాయణ కూడా.. రాజీనామాచేశారు. వాలంటరీ రిటైర్మెంట్ వెనుక. కారణాలు ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.