YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

కరెంట్ ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు

కరెంట్ ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు

హైదరాబాద్, ఆగస్టు 5,
వెండితెరకు సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. గత ఏడాదిన్నరగా థియేటర్లు అతలాకుతలం అయి వీటిపై ఆధారపడ్డ వారంతా రోడ్డున పడ్డారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని తెలుగురాష్ట్రాల్లో థియేటర్లు ఎట్టకేలకు ప్రారంభిస్తే ప్రేక్షకులు లేక వెలవెల పోయాయి అవి. ఈ పరిణామాలు ఫిలిం ఇండస్ట్రీ ని తీవ్ర నిరాశలో పడేస్తున్నాయి. అనేక కొత్త సినిమాలు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై వేసేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ఇప్పుడు జనం ధియేటర్ల వైపు రాకపోవడంతో ఇది సమయం కాదేమో అన్న సందేహం లో టాలీవుడ్ పెద్దలు తలపట్టుకుంటున్నారు.లక్షలాదిమంది తెలుగు సినిమా రంగం పై ఆధారపడ్డారు. వీరిలో చాలామందికి జీవన భృతి చాలా కష్టంగా మారింది. చాలామంది సినీ పెద్దల అభ్యర్ధనల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు అనుమతి మంజూరు చేశాయి. ఏపీ లో రోజుకు మూడు ఆటలకు మాత్రమే పర్మిషన్ తో బాటు 50 శాతం ఆక్యుపెన్సీ కి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 400 ల స్క్రీన్స్ పై బొమ్మపడింది. ఇందులో 250 థియేటర్లు ఏపీ లో, 150 స్క్రీన్స్ లో తెలంగాణ లోను ప్రదర్శనలు జరిగాయి. వీటికి అతి తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు హాజరుఅయ్యారు. ఇక ఆన్ లైన్ టికెట్లకు ఆదరణ అసలు లేనేలేదని సినీ జనం లెక్కలు చెబుతున్నాయి.ఆగస్టు 6 న కొన్ని కొత్త సినిమాలు రెండవ వారంలో మరికొన్ని స్టార్ ల చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరోల చిత్రాలు ప్రస్తుతం విడుదల కాకపోవడంతో ప్రేక్షకుల జోరు తగ్గిందని ప్రస్తుతం భావిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా దూసుకువస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కి ఇప్పట్లో కష్టాలు కడతేరేలా లేవు. దాంతో ఆగస్టు లో చాలా చిత్రాలు ఓటిటికి వెళ్లడం, లేదా అక్టోబర్ వరకు వేచి ఉండటం మాత్రమే మార్గాలు కనిపిస్తున్నాయి.

Related Posts