మేడ్చల్
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మల్కారం గుట్ట లల్లో మట్టి గ్రానైట్ మాయం అవుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో మట్టి గ్రానైట్ మాయం అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. మల్కారంలో ఒకప్పుడు ఎటు చూసినా గుట్టలు ఉండేవి. ఇప్పుడు అన్ని గుట్టలు మాయమవుతున్న వైనం. మట్టి గ్రానైట్ అక్రమంగా తరలించడం పై రెవెన్యూ అధికారులు సీరియస్ అయ్యారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాప్రా రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.