నర్సిపట్నం
విశాఖ జిల్లా మారుమూల గ్రామం మఠం భీమవరం పంచాయతీ నుంచి సుమారు వందమంది ఆధార్ కార్డు నమోదు కోసం తాసిల్దార్ కార్యాలయం చేరుకున్నారు. కొయ్యూరు మండలం, మఠంభీమవరం పంచాయతీ పరిధిలోని 15 గ్రామాల ప్రజలు సుమారు 70, 80 కిలోమీటర్ల దూరం నుంచి కొయ్యూరు ఆధార్ సేవల కోసం రావడం జరిగింది. వాళ్ళకి ఏ ప్రభుత్వ పథకాలు గానీ, సేవలు గానీ పొందాలంటే, కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కోసం ఇలా కొయ్యూరు రావలసిందేనని ఆయా గ్రామాల యువకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మా బాధలను అర్థం చేసుకోవాలి. మాకు రహదారి మార్గం మరియు తద్వారా మంచినీరు సమస్య కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నారు.