YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్ ఎస్ లెక్క..ఎవరికి నష్టం.. ఎవరికి లాభం

ఆర్ ఎస్ లెక్క..ఎవరికి నష్టం.. ఎవరికి లాభం

హైదరాబాద్, ఆగస్టు 5, 
ఊహించని విధంగా ఐ‌పి‌ఎస్ అధికార ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవి విరమణ చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈయన ప్రధాన పార్టీల్లో ఏదొక పార్టీలో చేరుతారని అంతా అనుకున్నారు. కానీ ఈయన బి‌ఎస్‌పిలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం ప్రవీణ్ జిల్లాల పర్యటన చేస్తూ, దళిత, గిరిజన ప్రజలని కలుస్తున్నారు. ఇదే క్రమంలోనే అధికార టీఆర్ఎస్‌పై కూడా విమర్శల దాడి పెంచారు.బహుజనుల అభ్యున్నతి కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని, పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును కేసీఆర్‌ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారని, ఇకముందు అలాంటి కార్యక్రమాలను సహించేది లేదన్నారు. అలాగే తాను ఎక్కడకెళ్లిన కరెంట్ కట్ చేసి ఆటంకం కలిగిస్తున్నారని, త్వరలోనే కేసీఆర్ కరెంట్ చేస్తానని మాట్లాడుతున్నారు. అలాగే తాను ఏ పార్టీకి మద్ధతుగా లేనని, విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుంద‌ని, అంటే టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.అలాగే త్వరలోనే బి‌ఎస్‌పిలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. అయితే బి‌ఎస్‌పికి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేని సంగతి తెలిసిందే. 2014లో ఎన్నికల్లో ఈ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. 2018 ఎన్నికల్లో బి‌ఎస్‌పి సత్తా చాటలేకపోయింది. కానీ దళితులు, గిరిజనుల్లో బి‌ఎస్‌పికి ఆదరణ ఉంది.అంటే బి‌ఎస్‌పి బలోపేతం అయితే వారి ఓట్లు బాగానే పడతాయి. మరి దళితుల, గిరిజనుల ఓట్లు చీలిపోవడం వల్ల నష్టం ఎక్కువగా కాంగ్రెస్‌కే ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే దళిత, గిరిజన వర్గాల్లో కాంగ్రెస్‌కు ఆదరణ ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో బి‌ఎస్‌పి పుంజుకుంటే ఆటోమేటిక్‌గా కాంగ్రెస్‌కే ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నాయి.

Related Posts