చిత్తూరు
కోటి రూపాయలు పైగా స్వాహా చేసిన సంఘమిత్ర లపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు రూరల్ మండలం మహిళ సమాఖ్య భవన్ ఎదుట డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు, కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తాము కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బులను , ఆసరా ,పావలా వడ్డీ ,పొదుపు , లోన్ డబ్బులను పోర్జిరి సంతకలతో సంఘమిత్రలు అరుణ ,బిందులు కలసి 1కోటి 50 లక్ష రూపాయలు కాజేశారని తెలిపారు , వారు కాజేసిన డబ్బులను తిరిగి కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు , తమ వ్యక్తి గత ఖాతా డబ్బుల ను బ్యాంకు అధికారులు జమ చేసుకుంటున్నారని వాపోయారు, తమకు న్యాయం చేయాలని కోరారు ..ఇందులో అవినీతి కి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు .