విశాఖపట్నం
ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చ ర్ వెల్ఫేయిర్ చైర్మన్ గా నియమిం చడం తనకు ఆనందంగా ఉందని మల్ల విజయ్ ప్రసాద్ అన్నారు. విశాఖలో మీట్ ధ ప్రెస్ కార్యక్రమంలో మాట్లా డుతూ పేద విద్యార్థులు చదువుకో డానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అందరి సలహాలతో ఎడ్యూకేషన్ కి సంబంధించిన ముందుకు వెళ్తామని, విద్యార్ధుల కు అవసరం అయిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని నూతన విద్య విధానాల్లో మార్పు దిశగా అడుగులు వేస్తామని అన్నారు. నాడు, నేడు కార్యక్రమంలో భాగంగా మహిళ విద్యార్థులకు సరైన బాత్ రూమ్స్, నీటి సదుపాయాలు మీద శ్రద్ద చూపిస్తున్నా మని,స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా క్లాస్ రూమ్స్ లో కూడా ఫ్యాన్స్, లైట్, వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. నిధులు ఎక్కడ తప్పుదారి పడకుండా చూస్తామని ప్రవేట్ పాఠశాలలకు ధీటుగా గవర్న మెంట్ పాఠశాలలను తీర్చిదిద్దడానికీ మా వంతు కృషి చేస్తామని తెలిపారు.