YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

మ‌హిళ శ‌రీరాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా అది రేప్ కింద‌కే... కేర‌ళ హైకోర్టు గురువారం సంచ‌ల‌న తీర్పు

మ‌హిళ శ‌రీరాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా అది రేప్ కింద‌కే... కేర‌ళ హైకోర్టు గురువారం సంచ‌ల‌న తీర్పు

మ‌హిళ శ‌రీరాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా అది రేప్ కింద‌కే...
         కేర‌ళ హైకోర్టు గురువారం సంచ‌ల‌న తీర్పు
తిరువ‌నంత‌పురం ఆగష్టు 5
పోక్సో చ‌ట్టం కింద న‌మోదైన‌ ఓ లైంగిక‌దాడి కేసులో కేర‌ళ హైకోర్టు గురువారం సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. పురుషాంగంతో మ‌హిళ శ‌రీరాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా అది రేప్ కింద‌కే వ‌స్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అయితే ఓ యువ‌కుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు అయింది. ఈ నేప‌థ్యంలో తాను లైంగిక‌దాడికి పాల్ప‌డ‌లేద‌ని, కేవ‌లం పురుషాంగంతో ట‌చ్ చేశాన‌ని, అది ఎలా లైంగిక‌దాడి అవుతుంద‌ని కోర్టుకు అభ్య‌ర్థించాడు. దీనిపై కోర్టు పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత‌.. సెక్ష‌న్ 375 ప్ర‌కారం.. యోని, మూత్ర‌నాళం, పాయువు వ‌ద్ద‌నే కాకుండా.. పురుషాంగాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా రేప్ చేసిన‌ట్టే అని కోర్టు తెలిపింది. అయితే బాధితురాలి వ‌య‌సును ఆమె త‌ర‌పు న్యాయ‌వాది నిర్ధారించ‌క‌పోవ‌డంతో.. పోక్సో కేసును కోర్టు కొట్టివేసింది. లైంగిక‌దాడికి సంబంధించిన సెక్ష‌న్ల కింద మాత్ర‌మే నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

Related Posts