YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పంట నమోదు తప్పనిసరి...ఏడిఏ మహమ్మద్ ఖాద్రి

పంట నమోదు తప్పనిసరి...ఏడిఏ మహమ్మద్ ఖాద్రి

పంట నమోదు తప్పనిసరి...ఏడిఏ మహమ్మద్ ఖాద్రి
మద్దికేర
మండల వ్యాప్తంగా రైతులు సాగుచేసిన ప్రతి ఒక్క పంటకు పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని పత్తికొండ ఎడిఎ మహ్మద్ ఖాద్రి తెలియజేశారు.ఈ సందర్భంగా గురువారం రోజున మండల పరిధి లోని పెరవలి మరియు బసినేపల్లి రైతు భరోసా కేంద్రాలను సందర్శించి వ్యవసాయ శాఖ అధికారులకు ఈ క్రాపింగ్ పై అవగాహన కల్పించారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న పంట నమోదు ప్రక్రియను ఏడిఏ మరియు ఏవో లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సాగు చేసిన తమ పంటలను వ్యవసాయ అధికారుల ద్వారా నమోదు చేయించుకోవాలని అని తెలియజేశారు.ఈ క్రాప్ బుకింగ్ అనంతరం రైతులు తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి 1బి జిరాక్స్,మొబైల్ నెంబర్,ఆధార్ కార్డు లను పొలం ఉన్న రైతు తీసుకొని వెళ్లి సాగు చేసిన పంటను నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా,రైతు భరోసా,క్రాప్ లోన్ మరియు పంట నష్టపరిహారం వంటి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఆయన తెలియజేశారు.ఈ క్రాప్ చేసుకొని రైతులకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించవని ఆయన తెలియజేశారు,కావున రైతులందరూ త్వరితగతిన పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిని హేమలత, వ్యవసాయ విస్తరణాధికారి యోగేంద్ర, ఎంపీఈవో లు శ్రీకాంత్,మాధవి,విహెచ్ఎ ఇంద్రజ మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts