YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బిజెపి నాయకుని పై ఎస్సై దాడి అమానుషం

బిజెపి నాయకుని పై ఎస్సై దాడి అమానుషం

బిజెపి నాయకుని పై ఎస్సై దాడి అమానుషం
ఆదోని
కౌతాళం మండలం కౌతాళం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త బోయ లింగన్న పై ఎస్సై మన్మద్ విజయ్ చేసిన దాడిని  బిజెపి రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ, బిజెపి జిల్లా కార్యదర్శి నాగరాజ గౌడ్ లు తీవ్రంగా ఖండించారు.గురువారం ఆదోని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో  వైద్య సేవల నిమిత్తం చేర్పించి లింగన్న ను పరామర్శించారు. అనంతరం డిఎస్పీ వినోద్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కౌతాళం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అక్కడి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, న్యాయం కోసం స్టేషన్ ను ఆశ్రయించే బాధితులకు ఎలాంటి న్యాయం చేయకుండా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులనే చేస్తూ, న్యాయం కోసం పోరాడే బీజేపీ నాయకుల పై స్టేషన్ కు పిలిపించి కొడుతున్నారని ఆరోపించారు. కౌతాళం మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతాని, ఎదుగుదలను ఓర్వని అధికార పార్టీ నాయకుల  ఏలాంటి ఆధారంలేని ఫిర్యాదుతో తేదీ ఈ నెల 4న  ఉదయం లింగన్నను స్టేషన్ కు పిలిపించి విచక్షణారహితంగా ఆ కారణంగా కొట్టి గాయాలపాలు చేశారన్నారు. ఏదైనా సమస్య ఉంటే స్టేషన్ కు పిలిపించి సంబంధిత ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలి వ్యక్తిని కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. సంబంధిత ఉన్నతాధికారులు ఎస్సై పై క్రమశిక్షణ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ వారు చేశారు. లేనిపక్షంలో జాతీయ బీసీ కమిషన్ ను, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని బాధితునీ తరపున ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ఉపేంద్ర, ఆదోని పట్టణ అధ్యక్షుడు జీందే సాయి, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ సింగ్, రాజశేఖర్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related Posts