నాగబాబు అల్లుడు రచ్చ...
మామ ఎంట్రీత్ రాజీ
హైదరాబాద్, ఆగస్టు 5,
మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీస్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ తన స్నేహితులతో మద్యం సేవించి రచ్చ చేస్తున్నట్లు పేర్కొంటూ అపార్ట్‌మెంట్ వాసులు పోలీస్ కేసు పెట్టారు. దీనిపై చైతన్య కూడా పోలీసుల వద్ద తన ఫిర్యాదు నమోదు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఫిలిం నగర్‌లో ఎక్కడ చూసినా ఈ ఇష్యూ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైతన్య రియాక్ట్ అవుతూ ఓ క్లారిటీ ఇచ్చారు.అపార్ట్‌మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నామని, కాంప్రమైజ్ అయ్యామని అన్నారు. షేక్ పేటలోని Tancica అపార్ట్మెంట్ యొక్క ఫ్లాట్ అద్దెకు తీసుకున్నామని, ఇందులో 25 నుంచి 30 కుటుంబాలు ఉంటున్నాయని చెప్పారు. అయితే ఇది అద్దెకు తీసుకునే ముందే ఆఫీస్ పర్పస్ కోసమని ఓనర్‌కి చెప్పామని ఆయన తెలిపారు.అయితే అపార్ట్‌మెంట్ అసోసియయేషన్‌కు సరైన క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారని చైతన్య అన్నారు. కమర్షియల్ ఆఫీస్‌గా ప్లాన్ చేయడంతో మిగితా ఫ్లాట్స్ వాళ్లకు ఇబ్బందికరంగా ఉందంటూ వచ్చి గొడవ లాగా చేశారని, దీంతో ఒకరిపై ఒకరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నామని చెప్పారు. ఆగస్టు 10వ తేదీన తాను అద్దెకు తీసుకున్న ఆ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని అపార్ట్‌మెంట్ ఓనర్‌కు కూడా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.చైతన్య అర్ధరాత్రి పూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దానికి రిటర్న్ కౌంటర్‌గా చైతన్య మరో ఫిర్యాదు అందించారు. చైతన్యకు, అపార్ట్మెంట్ వాసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ అపార్ట్ మెంట్ లో ఆ విధంగా యువకులతో కలిసి హంగామా చేయడం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని అపార్ట్ మెంట్ వాసులు చైతన్యతో చెప్పడం జరిగింది. దీంతో చైతన్య తీవ్ర ఆవేశానికి లోనై అపార్ట్మెంట్ వాసులను దూషిస్తూ వాగ్వాదానికి దిగాడు. అపార్ట్ మెంట్ వాసులు వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చైతన్య మీద ఫిర్యాదు చేశారు.దీంతో చైతన్య కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అపార్ట్మెంట్ వాళ్లు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదులను పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం నాడు జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు.దీనిపై పోలీసులు విచారణ చేస్తుండగా, ఇరువురు ఫిర్యాదు దారులు రాజీకి వచ్చినట్లు సమాచారం.