YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎల్ఐసి దక్షిణ మధ్య జోన్ ప్రీమియం వసూళ్ళలో వృద్ధి..!!

ఎల్ఐసి దక్షిణ మధ్య జోన్  ప్రీమియం వసూళ్ళలో వృద్ధి..!!

2016 - 2017  ఆర్ధిక సంవత్సరం తో పోలిస్తే  2017 - 2018 లో లైఫ్ ఇన్సూరెన్స్   కార్పేరేషన్ అఫ్ ఇండియా (ఎల్ ఐ సి ) దక్షిణ మధ్య జోన్ ప్రీమియం  వాసులలో 7 శాతం వృద్ధి చెందింది అని దక్షిణ మధ్య జోన్ జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. 2017 - 2018 కు సంబందించి జోన్ పని తీరు ముఖ్యంశాలు అయన వెల్లడించారు. 2017 - 2018  లో  50 ,000 కోట్లు ప్రీమియం వాసులు చేయడం విశేషం. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాలు ఉంటాయి. 2017 - 2018 లో కొత్తగా  29 .73 లక్షల పాలిసీల  ద్వారా వచ్చిన ప్రీమియం రూ 5 ,571 కోట్లు పెన్షన్, గ్రూప్ భీమా  పాలిసీల ప్రీమియం రూ 15, 552  కోట్లు  పైగా నమోదుయినది.  అంతే కాకుండా చంద్రన్న భీమా పథకం ద్వారా 206  కోట్లు పైగా ప్రీమియం వచ్చింది. 2017 - 2018 కలపరిమితి తీరిన 33,36 ,654 పాలిసీలపై రూ.12,458 కోట్లు చెలించినట్లు చెప్పారు. మొత్తం మరణ క్లెయిమ్ లు 1 ,44 ,609 కాగా .. రూ. 1,777 కోట్లు చెలించినట్లు పేర్కొన్నారు.పాలిసీల పునరాధనలో దేశవ్యాప్తంగా జోన్ మొదటి స్థానం సంపాదించగా, ఎల్ఐసి ఈ- సేవలకు సంబంధించి  వినియోగదారుల నమోదులో రెండో స్థానం లో దక్షిణ మధ్య జోన్ ఉందని సుశీల్ కుమార్ ప్రకటించారు.

Related Posts