YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కుంద్రాకు బిగిస్తున్న ఉచ్చు

కుంద్రాకు బిగిస్తున్న ఉచ్చు

కుంద్రాకు బిగిస్తున్న ఉచ్చు
ముంబై, ఆగస్టు 5,
వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆయన వ్యాపారవేత్త ముసుగులో చాలా మందిని మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజ్ కుంద్రా వల్ల ఆయన భార్య శిల్పా శెట్టిని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అశ్లీల వీడియోల కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ రాకెట్ గుట్టు రట్టు అవుతోంది. ఈ చీకటి వ్యవహారాలకు సంబందించిన ఒకొక్క విషయం బయటపడుతూ సంచలనంగా మారుతున్నాయి. ముంబై పోలీసులు వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సంబంధించిన పోర్న్ రాకెట్‌లో బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఒక మోడల్ సంచలన విషయాలు తెలిపింది.అయితే బాధితురాలు మాట్లడుతూ.. షూటింగ్ సమయంలో తన ప్రైవేట్ పార్ట్‌లు కనిపించకుండా ఎడిట్ చేస్తారని చెప్పి తనతో షూటింగ్ చేయించారని.. ఆ తర్వాత ఎలాంటి ఎడిటింగ్స్ లేకుండా ప్రైవేట్ పార్ట్‌లు చూపిస్తూ ఆ వీడియోను హాట్‌షాట్ యాప్‌లో ఉంచారని తెలిపింది.  తన స్నేహితురాలు చెప్పడంతో తనకు ఆ విషయం తెలిసిందని చెప్పుకొచ్చింది ఆ బాధితురాలు. అయితే రాజ్ కుంద్రా ఈ అశ్లీల రాకెట్ కేసులో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో.. అప్పుడే శిల్పాశెట్టి మార్కెట్ దెబ్బతినడం మొదలైందట.. ఆమె బ్రాండ్ తో పాటు ఆమె చేస్తున్న పలు కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడింది. అశ్లీల వీడియోల కేసులో ఈనెల 19న రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విసయాలు బయటకొస్తున్నాయి. దీంతో ఈ కేసు ఇప్పట్లో తేలాల కనిపించడం లేదు.

Related Posts