YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

రవికి వెండితో సరి..

రవికి వెండితో సరి..

రవికి వెండితో సరి..
టోక్యో, ఆగస్టు 5, 
భారత స్టార్‌ రెజ్లర్‌ రవి రజతంతో సరిపెట్టుకున్నాడు. హోరా హోరిగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌ చేతిలో 7-4 తేడాతో ఓడిపోయాడు. ఈ ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
ప్రధాని మోదీ ప్రశంసలు..
చివరి వరకు పోరాడి ఓడినా.. రవి కుమార్‌ దేశానికి మరో పతకాన్ని సంపాదించి పెట్టాడు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్‌లో హోరా హోరిగా జరిగిన మ్యాచ్‌లో ఓడిన రవి వెండి పతకాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘రవి కుమార్‌ దహియా అద్భుతమైన ఆటగాడు. అతను కనబరిచిన స్ఫూర్తి అద్భుతం. వెండి పతకం గెలిచుకున్నందుకు రవి కుమార్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
రాహుల్‌ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్‌ ట్వీట్..
భారత ఖాతాలో మరో పతకాన్ని చేర్చిన రవి కుమార్‌ దహియాకు ప్రముఖుల నుంచి ప్రశసంలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా రవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ట్వీట్‌ చేస్తూ రవి దేశానికి గర్వకారణంగా నిలిచాడని ట్వీట్‌ చేశారు.
రవికి హరియాణా సీఎం అభినందనలు.. భారీ నజరానా..
భారత్‌కు రజత పతకం తీసుకొచ్చిన రవి కుమార్‌పై ఆయన సొంత రాష్ట్రమైన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా.. రూ. 4 కోట్ల నగదు, క్లాస్‌ 1 ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇప్పిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రవి స్వగ్రామంలో రెజ్లింగ్‌ ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు
కొరికేసిన ప్రత్యర్ధి
టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరడం ద్వారా భారత్‌కి పతకం ఖాయం చేసిన రెజ్లర్ రవి కుమార్ దహియాని.. ప్రత్యర్థి నురిస్లామ్ సనయేవ్ (కజకిస్థాన్) ఆఖర్లో గట్టిగా కొరికినట్లు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఫురుషుల 57 కేజీల విభాగంలో బుధవారం సెమీస్‌లో ఈ ఇద్దరూ తలపడగా.. రవి 2-9తో ఓడిపోయేలా కనిపించాడు. కానీ.. ఆఖరి నిమిషంలో వ్యూహాత్మకంగా డబుల్ లెగ్ ఎటాక్‌‌తో నురిస్లామ్ సనయేవ్‌‌ని వెల్లకిలా పడేసిన రవి కుమార్.. అలానే అణచిపెట్టి విజేతగా నిలిచాడు. సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో ఫైనల్‌కి చేరిన రెండో భారత రెజ్లర్‌గా రవికుమార్ నిలవగా.. భారత్‌కి కనీసం రజత పతకం ఖాయమైంది.మ్యాచ్ చివరి నిమిషంలో రవి కుమార్ దహియా పట్టుకి బిత్తరపోయిన నురిస్లామ్ సనయేవ్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. రవి తన మెడని చుట్టేయడంతో తప్పించుకునేందుకు అతని చేతి కండని నురిస్లామ్ సనయేవ్ గట్టిగా కొరికేశాడు. అయినప్పటికీ.. బాధని భరించిన రవి కుమార్ నురిస్లామ్ సనయేవ్ వీపుని నేలకి ఆనించే వరకూ పట్టు వీడలేదు. నురిస్లామ్ సనయేవ్ తీరుని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Related Posts