YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

41 ఏళ్ల హాకీ కల... మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఇండియా

41 ఏళ్ల హాకీ కల... మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఇండియా

41 ఏళ్ల హాకీ కల...
మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఇండియా
టోక్యో, ఆగస్టు 5, 
క్యో ఒలింపిక్స్‌లో భారత ఫురుషుల హాకీ టీమ్ కాంస్య పతకం గెలుపొందింది. జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ జట్టు 5-4 తేడాతో విజయాన్ని అందుకుంది. 1980 ఒలింపిక్స్‌లో చివరిగా పతకం గెలిచిన భారత ఫురుషుల హాకీ టీమ్ ఎట్టకేలకి 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పతకం కరవుని తీర్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇప్పటికే వెయిల్‌లిప్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు. తాజాగా హాకీ టీమ్ కాంస్య పతకంతో భారత్ పతకాల సంఖ్య నాలుగుకి చేరింది. ఒలింపిక్స్‌లో ఎనిమిది పసిడి పతకాలు గెలిచిన చరిత్ర భారత హాకీ టీమ్‌కి ఉంది.కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ గొప్ప పోరాట పటిమని కనబర్చింది. సెమీస్‌లో అనూహ్యంగా బెల్జియం చేతిలో ఓడిన భారత్.. ఈరోజు తప్పిదాల్ని దిద్దుకుంది. అయితే.. మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే జర్మనీ గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. 17వ నిమిషంలో గోల్ కొట్టిన సిమ్రాన్‌జీత్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేశాడు. కానీ.. 24వ నిమిషంలోనే నిక్లాస్, 25వ నిమిషంలో బెన్‌డిక్ట్ గోల్స్ చేయడంతో జర్మనీ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో.. భారత్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లినట్లు కనిపించింది. అయితే.. 28వ నిమిషంలో గోల్ చేసిన హార్దిక్ సింగ్ జర్మనీ ఆధిక్యాన్ని 2-3కి తగ్గించగా.. నిమిషం వ్యవధిలోనే హర్మన్‌ప్రీత్ కూడా అద్భుతమైన గోల్‌తో ఆధిక్యాన్ని 3-3తో సమం చేశాడు. ఇక అక్కడి నుంచి మ్యాచ్ మరో స్థాయికి వెళ్లింది.
41 ఏళ్ల నుంచి ఒలింపిక్స్ లో హాకీ జట్టు పతకం సాధించాలని ప్రతి భారతీయుడు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ లో మళ్ళీ కాంస్యం అందుకుని 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్ ఫైట్‌లో భారత్ 5-4 తేడాతో జర్మనీని చిత్తు చేసింది. మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన మన్‌ప్రీత్ సేన చిరస్మరణీయ విజయాన్నందుకుంది. గతంలో 8 గోల్డ్ మెడల్స్ గెల్చిన భారత్.. 1980 నుంచి ఇప్పటి వరకు ఒక్క పతకం గేలవలేదు. తాజా కాంస్య పతకంతో ఆ కరువు తీరింది.అయితే నిజానికి 1980 లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకుంటే ఇప్పటి జట్టు ప్రదర్శన మెరుగుగా ఉందని.. పసిడి పట్టేస్తుందని చాలా మంది భావించారు. కానీ సెమీఫైనల్ లో ఒత్తిడి ని తట్టుకోలేక చివరి 15 నిమిషాల్లో ప్రత్యర్థి జట్టుకి గోల్స్ ఇచ్చి.. కాంస్యం తో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి పతకం అందుకోవడానికి పోడియంలోకి వెళ్తున్న భారత హాకీ జట్టుని చూసి మళ్ళీ హాకీకి మంచిరోజులు వచ్చాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.1928 నుంచి 1964 వరకూ మధ్య కాలాన్ని భారత హాకీకి స్వర్ణయుగంగా పిలుస్తారు. ఎందు కంటే అప్పుడు భారత్ ఏడు స్వర్ణ పతకాలు సాధించింది. వీటిలో ఆరు వరుసగా గెలిచింది. ఇక మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత జాతీయ క్రీడా హాకీ పతనం మొదలైంది. దీనికి కారణం క్రీడా మైదానం గడ్డి మైదానాలకు బదులు కృత్రిమ టర్ఫ్ ఉపయోగించడమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక భారత హాకీ జట్టు 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం క్వాలిఫై కూడా కాలేదు.దీంతో భారత హాకీ జట్టుకు కోచ్ లుగా విదేశీయుల నియామకం మొదలైంది. జోస్ బ్రాసా, మైకేల్ నోబ్స్, టెరీ వాల్ష్, పాల్ వాన్ ఎస్, రోలెంట్ ఓల్ట్‌మెస్ వంటి ఎంతోమంది కోచ్‌లు భారత్ వచ్చారు. చాలామంది తమ పదవీకాలం పూర్తి కాకుండా స్వదేశం వెళ్లిపోయారు. అయితే 2012 లండన్ ఒలింపిక్స్‌లో చివరి స్థానంలో నిలవగా రియో ఒలింపిక్స్‌లో 8వ స్థానంలో నిలిచింది. చివరకు గ్రాహమ్ రీడ్ భారత్ మెన్ హాకీ జట్టుని టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ వరకూ తీసుకుని వచ్చారు. చివరకు కాంస్యం పతకం భారత జట్టు అందుకుంది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదింపింది.
పంజాబ్ భారీ ప్రశంస
టోక్యో ఒలింపిక్స్ లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఇప్పటికే దేశ ప్రధాని మోడీ.. దేశానికి మీరు గర్వకారణం.. యువతకు ఆదర్శం అంటూ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా పంజాబ్ ప్రభుత్వం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన జట్టు పై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి ట్విట్టర్ వేదికా పొగిడారు. అంతేకాదు హాకీ జట్టులో ఉన్న పంజాబ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రకటించారు. కాంస్య పతకం సాధించడానికి భారత హాకీ పురుషుల జట్టులో భాగమైన ప్రతి పంజాబీ క్రీడాకారుడికి కోటి రూపాయల నగదు పురష్కారాన్ని స్తున్నామని ప్రకటించారు.ఈ రోజు భారత హాకీ చరిత్రలో గొప్ప రోజు… నగదుని అవార్డు గా ప్రకటించడం ఆనందం కలిగించిందని తెలిపారు. పతకం సాధించిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక భారత పురుషుల హాకీ జట్టులో పంజాబ్ నుంచి కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సహా ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు.
కెప్టెన్ మం ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, మన్ దీప్ సింగ్ లు దేశం తరపున హాకీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిస్తే.. ఇప్పటికే తమ రాష్ట్రనుంచి ఒలింపిక్స్ హాకీ జట్టులో పాల్గొన్న జట్టులోని సభ్యులకు ఒకొక్కరికి రూ.2.25 కోట్లు నగదు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Posts