చైనాను వణికిస్తోన్న డెల్టా వేరియంట్
బీజింగ్ ఆగష్టు 5
కరోనాకు పుట్టినల్లయిన చైనాను ఇప్పుడు అదే వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ఈ వేరియంట్‌కు సంబంధించిన 500 కేసులు సగం దేశంలో విస్తరించాయి. దీంతో ఆ దేశం మరోసారి కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించింది. దేశంలో కేసులు ఎక్కువగా ఉన్న 144 ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ట్యాక్సీ సేవలను రద్దు చేశారు. ఇటు బీజింగ్‌లోనూ రైలు, సబ్‌వే సర్వీసులను నిలిపేశారు. ఇక్కడ బుధవారం మూడు కేసులు నమోదయ్యాయి. ఇక మెయిన్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా క్వారంటైన్‌ను విధించాలని హాంకాంగ్ నిర్ణయించింది. గురువారం చైనాలో కొత్తగా 94 కేసులు నమోదయ్యాయి. దేశంలోని జనాభాలో 61 శాతం మందికి వ్యాక్సిన్లు వేసినా.. కేసుల సంఖ్య పెరుగుతుండటం అక్కడి అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. చైనా ఇస్తున్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాయా లేదా అన్నదానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. దీంతో వ్యాక్సినేషన్‌ను నమ్ముకోకుండా మరోసారి కఠినమైన ఆంక్షల వైపే ఆ దేశం మొగ్గు చూపుతోంది. బీజింగ్‌లో థియేటర్లు, పార్కులు వంటి అన్ని వినోద సంబంధిత ప్రదేశాలపై ఆంక్షలు విధించారు