కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు రాష్ట్రబంద్కు ఈ రోజు పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం వద్ద బాంబులతో కల్వర్టును పేల్చేశారు. .మావోయిస్టుల బంద్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు ఇసుక ర్యాంపులను మూసివేశారు. చర్ల, వాజేడు మండలాలకు బస్సులను నిలిపివేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఒడిసా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. జిల్లాలోని మండలాల్లో భద్రతాదళాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో తెలంగాణ, మహారాష్ట్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గురువారం నుండి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని చెరుపల్లి - మారాయిగూడెం ప్రధాన రహదారిపై కల్వర్టు కింద అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించాయి. బంద్ నేపధ్యంలో అలజడి సౄష్ఠించేందుకు ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. మరోవైపు, గురువారం చత్తీస్ఘడ్ భీజపూర్ జిల్లా లో మావోయిస్టులు రోడ్డు నిర్మాణంలో వున్న వాహానాలను తగలబెట్టారు. .ప్రదానమంత్రి గ్రామ సడక్ యోజన లో భాగంగా రోడ్డు నిర్మణంలో వున్న వాహానాలకు నిప్పంటించారు. రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న ఒక జేసీబీ, నాలుగు ట్రాక్టర్టు, ఒక రోడ్రోలర్ మిషిన్కు నిప్పంటించారు.