విజయవాడ
క్రీడాకారిణి సింధు శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తరువాత సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆమె వేదాశీర్వచనం చేసారు. ఆలయ ఈఓ భ్రమరాంబఅమ్మవారి ప్రసాదం మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. పి.వి.సింధు మాట్లాడుతూ టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చాను. ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది. 2024లో కూడా ఒలింపిక్స్లో ఆడాలి. ఈసారి స్వర్ణం సాధించాలని అన్నారు.