YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మాణిక్ ఠాగూర్ లెక్కెంటీ

 మాణిక్ ఠాగూర్ లెక్కెంటీ

హైదరాబాద్, ఆగస్టు 6, 
తెలంగాణలో కాంగ్రెస్ కొంచెం గాడిన పడుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంచెం హైప్ క్రియేట్ అయింది. మీడియాలో సయితం కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయారిటీ లభిస్తుంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో కలహాలు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ పై పడింది. ఆయన పార్టీ నేతలను గాడిలో పెట్టే ప్రయత్నంలో పడ్డారు.మాణికం ఠాగూర్ ఇన్ ఛార్జి పదవి తీసుకున్నాక తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక్క విజయమూ దక్కలేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయింది. సాగర్ లో గెలిచే పరిస్థితులున్నా ఓటమి గల కారణాలను కనీసం విశ్లేషించేందుకు కూడా కాంగ్రెస్ నేతలు ప్రయత్నించలేదు. దీనికి నేతల మధ్య అనైక్యత కారణమని మాణికం ఠాగూర్ భావిస్తున్నారు.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలను తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంపుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమయిందని భావిస్తున్నారు. అయితే నేతల మధ్య అనైక్యత ఇంకా కొనసాగతుందని భావించిన మాణికం ఠాగూర్ నేతలందరితో విడివిడిగా ఫోన్ లో మాట్లాడుతూ వారిలో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.ఎవరు అవునన్నా, కాదన్నా వచ్చే రెండేళ్లు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారన్న విషయాన్ని మాణికం ఠాగూర్ గుర్తు చేస్తున్నారు. ఐక్యతతో పనిచేస్తే అందరికీ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. పార్టీని బలహీనపర్చే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని మాణికం ఠాగూర్ పరోక్షంగా నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల కట్టడికి మాణికం ఠాగూర్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Related Posts