గన్నవరం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహ్వేరరావుకు గన్నవ రంలో అపూర్వ స్వాగతం లభించిం చింది.పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇన్చార్జి,శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై ఉమాకు స్వాగతం పలికా రు.వారం రోజుల క్రితం కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, తనకు బెయిల్ మంజూ చేయాలంటూ ఉమా హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేయగా, ఆయన రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు.తనపై అక్రమంగా కేసు బనాయించి వారం రోజులపాటు జైలులో ఉంచారన్నారు. ప్రజాస్వా మ్యంలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. చివరకు పౌరుల హక్కులను కూడా వారించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారన్నారు.