కాంస్య పతకం సాధించిన సింధుకు....... కోట్ల రూపాయలు ఐదు ఎకరాల భూమి. కావలిసినంత మీడియాలో ప్రచారం.
టీవీ ఛానెల్స్ వాళ్లకు జాతికి ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించిన శైలజ కనబడదు. శైలజకు ప్రభుత్వ సహకారం ఉండదు. ఎందుకంటే మన దేశంలో కులం బట్టే తప్ప సామర్థ్యంను బట్టి విలువ వుండదు. పూజారి శైలజ..! ఒక ఆడపిల్ల 16 సంవత్సరాల క్రితం క్రీడా ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు..!
18 అంతర్జాతీయ అవార్డులు..
(17 గోల్డ్,1సిల్వర్)
26జాతీయ అవార్డులు..
మరెన్నో పతకాలు..!
ఈ రోజున తినడానికి తిండి కూడా లేని పరిస్ధితిలో..ఇదిగో... ఇలా రోడ్డున పడి, ఎవరైనా సాయం చేస్తారా అన్నట్లుగా కూర్చుని ఉంది..ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీరు ఆ రోజున తనకు ఇచ్చిన మాట మీద నిలబడి, తనకు ఒక ఉద్యోగం ఇవ్వండి. ఎకరాలు ఎకరాలు స్థలాలు అవసరం లేదు ఒక గూడు ఏర్పాటు చేయండి అంటున్న ఆ ఆడపిల్ల ఆవేదన.
మన భారతీయ క్రీడాకారిణి ఆడపడుచును కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ప్రభుత్వం , ప్రజాప్రతినిధులు , ప్రజాసంఘాలు , ప్రజాస్వామిక పార్టీలు , మొదలైన వారందరి దృష్టికి తీసుకెళ్లే విధముగా షేర్ చేయండి.
Contribution: PV.Rama Mohana Baidu, Sr.Journalist