శ్రీదేవి కి "మామ్" సినిమా కి జాతీయ అవార్డు వరించింది. తల్లిగా ఆమె నటనకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఈ అవార్డును గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా శ్రీదేవి కుటుంబ సభ్యులు అందుకున్నారు. ఈ అవార్డు తీసుకునేందుకు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ శ్రీదేవి చీర కట్టుకుని వచ్చి అవార్డ్ స్వీకరించింది.జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లతో కలిసి బోనీకపూర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ ఈ సినిమా ని దర్శకుడు చాల చక్కగా చిత్రీకరించారని , శ్రీదేవి ఉండి ఉంటే చాలా సంతోషిచేదని చెపుకునివచ్చారు.