కావలి పట్టణ లాక్ డౌన్ లో ఎలాంటి మార్పు లేదు
కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాదరావు
నెల్లూరు
నెల్లూరు జిల్లా, కావలిలో కొనసాగుతున్న కర్ఫ్యూ వేళల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని కావలి డివిజనల్ పోలీసు అధికారి దేవరకొండ ప్రసాదరావు స్పష్టం చేశారు . శుక్రవారం ఉదయం డీఎస్పీ చాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ కరోన నియంత్రణ దృష్టిలో వుంచుకొని అన్ని రాజకీయపక్షాల నాయకులు , వివిధ శాఖల అధికారులు , వ్యాపారస్తులు , ప్రజలు , మీడియా ప్రతినిధులు కలిసి కర్ఫ్యూ వేళలు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలవరకు ఉండేవిధంగా గతంలో తీసుకున్న నిర్ణయమే ప్రస్తుతం అమల్లోవుందన్నారు . కొత్తగా ఎలాంటి మార్పులు జరగలేదన్నారు . ఎలాంటి మార్పులు వున్నా ముందుగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు . నెల్లూరు నగరంలోనూ సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు . చిన్న చిన్న వ్యాపారస్తులు , చిన్న పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న పేదలను , ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న గత నిర్ణయం ప్రకారమే కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు . కర్ఫ్యూ వేళల్లో మార్పులేమీ జరగలేదన్నారు . కరోన నియంత్రణకు అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని , అధికారులకు ప్రజలు సహకరిస్తే థర్డ్ వేవ్ ను అరికట్టవచ్చన్నారు . ప్రజల్లో చైతన్యం రావాలన్నారు . ప్రజల్లో మార్పు రానిదే ఏదీ సాధ్యంకాదన్నారు . ప్రజలు బయటికి వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం , భౌతిక దూరం పాటించడం , శానిటైజ్ చేసుకోవడం లాంటివి ప్రధానంగా పాటించాలని డీఎస్పీ దేవరకొండ ప్రసాదరావు ప్రజల్ని కోరారు .