YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఢిల్లీ  తెలంగాణ భవన్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ఢిల్లీ  తెలంగాణ భవన్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ఢిల్లీ  తెలంగాణ భవన్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
న్యూ ఢిల్లీ ఆగష్టు 6
ఢిల్లీలోని  తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్,  ఎమ్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి ప్రో. సీతారామరావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా డా, బండ ప్రకాష్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనితర కృషి చేసిన వ్యక్తి ప్రో, జయశంకర్ సార్. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను ఎలుగెత్తి పోరాడాడు.సాధించుకునే తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలని ఒక విజన్ కలిగిన వ్యక్తి ఆయన. ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోంది. ప్రో. జయశంకర్ సార్ కలలుగన్న అన్నివర్గాల అభివృద్ధి సాకారం అవుతోంది. బడుగుల లింగయ్య, రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రో, జయశంకర్ సార్ పోరాడారు. ఆయన ఆశించినట్లుగా తెలంగాణలో గడచిన 7ఏళ్లుగా పాలన సాగుతోంది. బడుగుల సంక్షేమం, అభివృద్ధి లో ముందుకు వెళుతున్న రాష్ట్రం. దళిత బంధు, రైతులకు బీమా, ఉచిత కరెంటు ఇలా అనేక పథకాలు అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.జయశంకర్ సార్ కోరుకున్న సమాజం రానున్న రోజుల్లో సాకారం అవుతుంది.
శ్రీమతి మాలోత్ కవిత, ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భంలో జయశంకర్ సార్ గారిని గుర్తు చేసుకున్నారు. సిద్దించిన తెలంగాణా ను ఆయన చూడలేదని సీఎం బాధ పడుతూ ఉంటారు. జయశంకర్ సార్ ఆలోచన విధానంలోనే తెలంగాణ పథకాలు ఉన్నాయి. ఆయన స్పూర్తితో ప్రజాప్రతినిధులుగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.పసునూరి దయాకర్, ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయన కృషి మరువలేనిది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయలపై ఆయన పోరాడారు. అనేక పుస్తకాలు రచించారు, వ్యాసాలు రాసారు. ఉద్యమంలో జయశంకర్ సార్ తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఆయన స్పీచ్ లను ఆదర్శంగా తీసుకొని ఉద్యమంలో పాల్గొన్న. ఆయన ఆలోచనకు తగ్గట్టుగా దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది.బిబి పాటిల్, ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రో, జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. ప్రో. జయశంకర్ సార్ ను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలుస్తోంది.వెంకటేష్ నేత, ఎంపీ మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపిన వ్యక్తి ప్రో. జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఆయన. అభివృద్ధి, సంక్షేమలో అన్నివర్గాలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలంగాణ ముందుకు సాగుతోంది.గండ్ర వెంకటరమణ రెడ్డి, భూపాల్ పల్లి ఎమ్మెల్యేబ్రతుకున్నంత కాలం తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కార్యాచరణ సిద్ధం చేశారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ జిల్లాకు సీఎం కేసీఆర్  జయశంకర్ సార్ పేరు పెట్టారు. ఆయనను స్మరించుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. ఆయన అడుగుజాడల్లో తెలంగాణ సమాజం ముందుకు పోతోంది. ప్రో. సీతారామరావు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి మాట్లాడుతూ జయశంకర్ సార్ తో ఉద్యమంలో కలిసి పనిచేసిన అదృష్టం నాకు దక్కింది.రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలా ఉండాలని ఆయనకు గొప్ప స్వప్నం ఉండేది. ఆయన స్వప్నంను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతోంది. ఉన్నత విద్యా రంగానికి ప్రో.జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివి. ఆ రోజుల్లో మాలాంటి యువ ప్రొఫెసర్లకు ఆయన ఆదర్శంగా నిలిచారు. మానవీయమైన సమ సమాజ నిర్మాణం కోసం మనం ప్రతిజ్ఞ తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు నడవాలి.ఈ కార్యక్రమంలో భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts