మసీదు మరియు మదర్సా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు బిట్ 1 శ్రామిక నగర్ లో మసీదు మరియు మదరస కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ముస్లిం మతపెద్దలు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని పట్టించేందుకు మరియు గ్రంథ విశిష్టతను తోటి ముస్లిములకు తెలియజేయుటకు మరియు ప్రార్థనలకు మసీదులు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే ముస్లిముల మనోభావాలను ఆధ్యాత్మిక చింతనతో తమ తోటి వారికి ఉపయోగపడే విధంగా విద్యను అభ్యసించుటకు వీలుగా మదర్సాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఎంతోకాలం నుండి ఖురాన్ పవిత్ర గ్రంథాల్ని ముస్లిం పిల్లలకు మరియు పెద్దలకు క్లుప్తంగానూ స్పష్టంగానూ తెలియజేయడమే కాకుండా నైతిక విలువలను పెంపొందించుటకు మదర్సాలు ఎంతో అవసరమన్నారు. ఈ క్రమంలో స్థానికంగా మసీదు మరియు మదర్సాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ ఇంఛార్జ్ కూకాటి ప్రసాద్, కూకాటి హరి, నారాయణ రెడ్డి, 32వ డివిజన్ ఇంఛార్జ్ బత్తల కృష్ణ, షమీ హుస్సేన్, సంషుద్దీన్, కరీముల్లా, డాక్టర్ సత్తార్, రియాజ్, బాబులు, ఖాదర్ బాషా, జమీర్, అహ్మద్ బాషా, రజాక్, ఇస్మాయిల్ ఖాద్రి, రసూల్, నజీర్, రఘు, యానాదయ్య, విగ్నేష్, ఆనంద రావు, పాశం మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.