యాసంగి సాగులో వేరుశెనగ ప్రధానపంట కావాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ ఆగష్టు 6
యాసంగి సాగులో వేరుశెనగ ప్రధానపంట కావాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వేరుశెనగ నాణ్యత, దిగుబడి పెరగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణలో వేరుశనగ విస్తీర్ణం, నాణ్యత, దిగుబడుల పెంపు కోసం పరిశోధనపై ఇక్రిశాట్, వ్యవసాయ శాఖవిశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.రూ.9 కోట్ల అంచనాతో ఇక్రిసాట్ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా వేరుశనగ పరిశోధన కొరకై ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసిందన్నారు.ఇక్రిశాట్ సహకారంతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేరుశెనగ నూతన వంగడాల కోసం పరిశోధనఅయోలిక్ యాసిడ్ అధికంగా ఉండి అధిక దిగుబడి నిచ్చే ఆఫ్లాటాక్సిన్ రహిత వంగడాలతో పాటు వైరస్ లను తట్టుకునే వంగడాలను రూపొందించాలని సూచించారు.వేరుశెనగ పరిశోధనలో యాంత్రీకరణకు కూడా ప్రాముఖ్యతనివ్వాలని,స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కు అనుకూలంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.దానికి సంబంధించి ఇప్పటి నుండే కార్యాచరణ చేపట్టాలి .. రైతుబంధు సమితులు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఇప్పటికే మంజూరయిన వనపర్తి వేరుశెనగ పరిశోధన కేంద్రానికి మౌళిక వసతుల కల్పనకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆదేశాలు .. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పెలిపారు.వేరుశెనగ పంట సాగుకు తెలంగాణ నేలలు అనుకూలమని,
గుజరాత్ లో అత్యధికంగా వేరుశెనగ దిగుబడి ఉన్నా అంతర్జాతీయ ఎగుమతులకు సరిపడా నాణ్యత లేదు ... తెలంగాణ వేరుశెనగ నాణ్యతలో దేశంలో నంబర్ వన్ అన్నారు.దేశంలో తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ గ్రౌండ్ నట్ గా అభివృద్ది చేయాలన్నారు.దేశ అవసరాలను పరిగణనలోకి తీసుకుని దీనిని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించిదానికి తగినట్లు రాష్ట్రంలో నూనెగింజల సాగును ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమమం లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, పరిశోధనా సంచాలకు డాక్టర్ జగదీశ్వర్, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డాక్టర్ జనీలా, డాక్టర్ అశోక్, డాక్టర్ హరికిషన్ తదితరులు మ్పాల్గొన్నారు.