YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మోడీకే నా  మద్దతు - బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి.

మోడీకే నా  మద్దతు - బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి.

మోడీకే నా  మద్దతు
లక్నో, ఆగస్టు 6,
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెనుకబడి తరగతుల జనాభా లెక్కల సేకరణకు నిర్మాణాత్మక చర్యలు చేపడితే కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ లోపల, వెలుపల  బీఎస్పీకి  మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. అన్ని కులాల వారిగా జనగణన చేపట్టాలని, కేవలం ఎస్సీ, ఎస్టీలకు పరిమితం చేయరాదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన మర్నాడే మాయావతి పై విధంగా స్పందించడం గమనార్హం. జనాభా లెక్కలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని బిహార్ సీఎం నితీశ్ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ నేపథ్యంలో మాయావతి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘దేశంలోని వెనుకబడిన వర్గాల జనాభా లెక్కించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది.. ఒకవేళ కేంద్రం ఈ విషయంలో సానుకూల చర్యలు చేపడితే బీఎస్పీ కచ్చితంగా పార్లమెంట్ లోపల, బయట మద్దతు ఇస్తాం’ అని మాయావతి ట్విట్టర్‌లో తెలిపారు.గతేడాది ఫిబ్రవరిలోనూ కులాల వారీగా జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ బీహార్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను అమలు చేసేందుకు ఆమోదం తెలిపిన నితీశ్ కుమార్.. 2010 నాటి విధానంలోనే ఈ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. అసెంబ్లీలో తీర్మానంపై నితీశ్ మాట్లాడుతూ... ‘‘దేశంలో కులాల వారీ జనగణన జరపాలన్నదే మా డిమాండ్.. కులాల ఆధారంగా జనగణన చివరిసారి 1930లో జరిగింది. ఇప్పుడు మరోసారి దీన్ని చేపట్టాలని మేము కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.ఇదే అంశంపై నితీశ్ మాట్లాడుతూ.. ‘కులాల ఆధారంగా జనాభా లెక్కల సేకరణ కేంద్రం చేపట్టినా, లేకున్నా మా అభిప్రాయాలను తెలియజేయడం ముఖ్యం.. ఒక కులాన్ని ఇష్టపడుతుంది.. మరొక కులాన్ని ఇష్టపడదని అనుకోవద్దు.. అందరి ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటుంది..’ అని వ్యాఖ్యానించారు.

Related Posts