YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

హాకీలో అమ్మాయిలు ఓటమి కన్నీరు మున్నీరు

హాకీలో అమ్మాయిలు ఓటమి కన్నీరు మున్నీరు

హాకీలో అమ్మాయిలు ఓటమి కన్నీరు మున్నీరు
టోక్యో, ఆగస్టు 5,
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి కాంస్య పతకం చేజారింది. గ్రేట్ బ్రిటన్‌తో శుక్రవారం కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ టీమ్ 3-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. చివర్లో హ్యాట్రిక్ పెనాల్టీ కార్నర్‌లను సమర్పించుకున్న భారత జట్టు మూల్యం చెల్లించుకుంది. భారత ఫురుషుల హాకీ టీమ్ 41 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.మ్యాచ్ ఆరంభం నుంచి గ్రేట్ బ్రిటన్ దూకుడుగా ఆడింది. 2016 రియో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ఆ టీమ్.. ఈరోజు భారత్ జట్టుని చివరి వరకూ ఒత్తిడిలో ఉంచగలిగింది. పదే పదే భారత్ గోల్ పోస్ట్‌పై దాడి చేసిన గ్రేట్ బ్రిటన్.. ఆరంభంలోనే 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిపోగా.. గుర్జీత్ కౌర్ అసమాన ప్రదర్శనతో ఆరు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి 2-2తో భారత్ జట్టులో మళ్లీ ఉత్సాహం నింపింది. మరో రెండు నిమిషాల్లో మూడో క్వార్టర్ ముగుస్తుందన్న దశలో వందన గోల్ చేయడంతో భారత్ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ.. మూడో క్వార్టర్‌లో బ్రిటన్ కెప్టెన్ హౌలీ గోల్ చేయడంతో మ్యాచ్ 3-3తో ఉత్కంఠగా మారింది. అయితే.. చివరి క్వార్టర్‌లో భారత్ వరుస తప్పిదాలు చేస్తూ బ్రిటన్‌కి హ్యాట్రిక్ పెనాల్టీ కార్నర్‌లు సమర్పించుకుంది. ఈ క్రమంలో గ్రేస్ ఒక పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలచడంతో భారత్ జట్టు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోగా.. చివర్లో బ్రిటన్ డిఫెన్స్‌ని ఛేదించడంలో భారత్ విఫలమైంది1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఆరు జట్లు మాత్రమే పోటీపడగా.. రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఆ ఒలింపిక్స్‌లో టాప్-4లో నిలిచిన భారత మహిళల హాకీ టీమ్.. ఒలింపిక్స్‌లో పోటీపడటం ఇది మూడోసారి మాత్రమే. 1980 ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రమే పోటీపడిన భారత మహిళల హాకీ టీమ్ మరోసారి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తంగా ఒలింపిక్స్‌లో భారత మహిళల టీమ్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

Related Posts