YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బుచ్చయ్య ఒంటరైపోయారా

బుచ్చయ్య  ఒంటరైపోయారా

రాజమండ్రి, ఆగస్టు 7, 
అస‌లే.. టీడీపీ క‌ష్టాల్లో ఉంది. గ‌త ఎన్నిక‌ల ఎఫెక్ట్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోలుకోలేక పోయింది. పైగా యాక్టివ్‌గా ఉండాల్సిన నాయ‌కులు, ఎమ్మెల్యేలు చాలా మంది సొంత ప‌నుల్లో బిజీగా ఉన్నారు. అలాంట‌ప్పుడు యాక్టివ్‌గా ఉన్న ఒక‌రిద్ద‌రికైనా.. పార్టీ నుంచి మ‌ద్ద‌తు అవ‌స‌రం క‌దా ? మ‌రి ఈ విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్ధం కాని ప‌రిస్థితి . మాట్లాడేవారికి మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిన నేత‌లు.. మౌనంగా ఉంటున్నారు. పోనీ..వారైనా మాట్లాడ‌తారా? అంటే అది కూడా లేదు. మ‌రి ఈ స‌మ‌యంంలో స‌ద‌రు నేత‌లకు నైతిక మ‌ద్ద‌తు ఎక్క‌డ నుంచి వ‌స్తుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. పైగా పార్టీలో ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న వారిలో కూడా బాబు కోట‌రిలో ఉన్న వారికే ప్రాధాన్య‌త ఉందే త‌ప్పా.. మిగిలిన వారిని ప‌ట్టించుకునే వాళ్లు లేర‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.ఈ విష‌యం అంతా రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి గురించే ..! బుచ్చ‌య్య చౌద‌రి రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీని సైతం త‌ట్టుకుని ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ ఉప నేత‌గా అయితే అవ‌కాశం చిక్కించుకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌కు , ఆయ‌న‌కు మ‌ధ్య దూరం పెరుగుతోంది. కీల‌క నేత‌లు ఎవ‌రూ కూడా గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వైపు ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ అస‌హ‌నంతోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని అయిష్టంగానే ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు తెలుస్తోంది.అదే స‌మ‌యంలో రాజ‌మండ్రి సిటీపైనా త‌08 న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాల‌నే ధోర‌ణితో గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రూ కూడా ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ఆయ‌న గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నా… ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా కోర‌స్ క‌లుపుతున్న నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఇక పార్టీలో సీనియ‌ర్‌గా ఉన్న‌ప్ప‌ట‌కి అటు పార్టీ విధివిధానాల్లోనూ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మాట‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ అసంతృప్తి కూడా ఆయ‌న‌లో ఉంది. తాజాగా.. అమ‌రావ‌తి భూముల విష‌యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ రాజీనామా చేయాల‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి డిమాండ్ చేశారు.ఇది మంచి స‌బ్జెక్టే. పైగా టీడీపీకి క‌లిసి వ‌చ్చే స‌బ్జెక్టే. అయిన‌ప్ప‌టికీ.. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రితో క‌లిసి వ‌చ్చిన నాయ‌కులు, ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడిన నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా క‌నిపించ‌లేదు. దీంతో గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఒంట‌ర‌య్యారా ? అనే సందేహాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిను ఎలా సంతృప్తి ప‌రుస్తారో ? చూడాలి.

Related Posts