YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

విమాన రంగానికి 25 వేల కోట్ల నష్టం

విమాన రంగానికి 25 వేల కోట్ల నష్టం

న్యూఢిల్లీ, ఆగస్టు 7, 
కరోనా మహమ్మారి కారణంగా  దేశంలోని ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టులు రూ. 22,400 కోట్ల నష్టాల పాలయినట్లు అఫీషియల్ డేటా వెల్లడించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కింద నడుస్తున్న ఎయిర్పోర్టులలో 75 శాతం నష్టాలతోనే నడుస్తున్నట్లు డేటా చెబుతోంది. ఏఏఐ రెవెన్యూ కూడా ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రూ. 889 కోట్లకు తగ్గిపోయినట్లు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి వీ కే సింగ్ గురువారం లోక్సభకు వెల్లడించారు. కరోనా దెబ్బకు గ్లోబల్గాను, దేశంలోనూ కూడా ఏవియేషన్ సెక్టార్ కకావికలమైందని, ఫైనాన్షియల్గా ఇబ్బందులలో పడిందని ఆయన చెప్పారు. ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టులు 2019–20లో రూ. 19 వేల కోట్లు, 2020–21లో రూ. 3,400 కోట్లు నష్టం పొందినట్లు పేర్కొన్నారు. ఏఏఐ రెవెన్యూ అంతకు ముందు ఏడాదిలోని రూ. 2976 కోట్ల నుంచి ఏకంగా రూ. 889 కోట్లకు పడిపోయిందని చెప్పారు. కరోనా వైరస్ వల్ల దేశీయ ప్యాసెంజర్ ట్రాఫిక్ 2019–20లో 0.3 శాతం, 2020–21లో 61.7 శాతం పడిపోయినట్లు వెల్లడించారు. కరోనా ఎఫెక్ట్ తగ్గితే రాబోయే కొన్నేళ్లలో ఎయిర్ప్యాసెంజర్ ట్రాఫిక్ రెట్టింపయ్యే అవకాశం ఉందని సింగ్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతున్నందు వల్ల ఎయిర్ ట్రాఫిక్పై తక్కు ప్రభావమే ఉంటుందని అంచనా వేశారు.

Related Posts