YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళిత బంధు వంద మందికే

దళిత బంధు వంద మందికే

నల్గొండ, ఆగస్టు 7, 
ష్ట్రంలోని దళిత కాలనీల్లో కీలకమైన సర్వే ప్రారంభించారు. దళిత వాడల్లో మౌలిక సదుపాయాలపై మొదలుపెట్టిన వివరాల సేకరణలోనే భాగంగా దళిత బంధు అర్హత కోసం ప్రభుత్వం వ్యక్తిగత సర్వేకు ఆదేశాలిచ్చింది. బుధవారం రాత్రి జారీ చేసిన జీవోలో ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ సర్వే ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అధికారులు చెప్పుతున్నారు. వ్యక్తిగత సర్వే చాలా పటిష్టంగా చేయాలంటూ ఉన్నతాధికారులు సైతం కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ సర్వే కీలకమవుతున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేని ఏకైక పథకం దళిత బంధు పథకమే. వీటి కోసమే ఈ సర్వే చేస్తున్నారని అంచనా వేస్తున్నారుదళిత బంధు స్కీం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని హుజురాబాద్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించినా.. కొన్ని ప్రత్యేక పరిస్థితులతో వాసాలమర్రి నుంచి మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలతో గురువారం ఉదయం నుంచి పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలోని బృందం గ్రామాలకు తరలింది.దళిత వాడల్లో సౌకర్యాలతో పాటుగా ఒక్కో ఎస్సీ కుటుంబం వివరాలను సేకరిస్తున్నారు. దీనికోసం 10 పాయింట్లతో ప్రత్యేక ఫార్మాట్ను తయారు చేశారు. ఈ ఫార్మాట్లో కీలకమైన అంశాలున్నాయి. ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితులన్నీ ఈ పరిశీలనలో తేల్చనున్నారు. ఈ వ్యక్తిగత సర్వే అనంతరం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలకు వారి ఖాతాలకు జమ చేయనున్నట్లు అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్పుతున్నారు. కుటుంబానికి పక్కా ఇల్లు ఉందా.. ఎంత జాగ ఉంది.. ఇంట్లో సరాసరి ఆదాయం ఎంత… ఇంట్లో చదువుకున్న వాళ్లు ఉన్నరా.. ఉంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి.. ఉద్యోగాలు చేసే కుటుంబాలు ఏమైనా ఉన్నయా.. అనే కోణంలో వ్యక్తిగతంగా సర్వే చేపట్టారు. సొంత ఇల్లు, వ్యవసాయ భూములు, వాహనాలపై వివరాలు తీసుకుంటున్నారు.ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేకుండా అమలు చేస్తున్న స్కీం దళితబంధు మాత్రమేనని అధికారులు చెప్పుతున్నారు. ఈ మార్గదర్శకాల కోసమే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సర్వేలో సొంత ఇల్లు, కారు ఉంటే అనర్హులుగా గుర్తిస్తారని అధికారుల్లో టాక్. దీనిలో భాగంగానే కొంత లగ్జరీ వస్తువుల వివరాలను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. కాగా ప్రతి నియోజకవర్గంలో ముందుగా 100 మంది లబ్ధిదారులకే పరిమితం అవుతుందని చెప్పుతున్నారు. దీనికోసం ప్రతి జిల్లా కలెక్టర్ ఖాతాలో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున ముందుగానే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యక్తిగత వివరాలే దళిత బంధు పంపిణీకి ప్రామాణికం కానుంది. నియోజకవర్గం పరిధిలో ఎంత మంది అర్హులు ఉన్నా ప్రస్తుతానికి అందించేది మాత్రం వంద మందికే

Related Posts