ఒంగోలు
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు కోవిడ్ బాధితురాలి బంధువు. వార్డు లోనే నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అటు నిందితుడుని అడ్డుకున్న వార్డులోని రోగులు, వారి బంధువులు నర్సును కాపాడారు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు నిందితుడు విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో వెంటనే కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.