విజయవాడ
విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మారు వేషంలో సంచరించారు. సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లిన సబ్ కలెక్టర్ అక్కడ ఒక దుకాణంలోకి ఎరువులు కావాలని అడిగారు . అయనకు ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా లేవని యజమాని చెప్పాడు. అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు. సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి సదరు షాపు యజమాని ఎంఆర్పీ ధర కన్నా అధికంగా వసూళ్లు చేసిన వసూళ్లు చేసాడు. సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు. ఆ తర్వాత సబ్ కలెక్టర్ ఒకొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించారు. రెండు షాపులను సీజ్ చేయించారు. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో అక్కడి రైతులను సబ్ కలెక్టర్ వాకబు చేసారు. ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని రైతులు సబ్ కలెక్టర్ కు తెలిపారు. షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.