బెంగళూరు
కర్నాటక, కోలార్ జిల్లాలోని దేవరాయసముద్రం సమీపంలో సెల్ ఫోన్స్ కంటైనర్ దోపిడీ జరిగింది.సుమారు 6 కోట్ల విలువైన ఎం.ఐ మొబైల్స్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. మొబైల్ లోడ్ తమిళనాడులోని కాంచీపురం నుంచి బెంగళూరుకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సినీఫక్కీలో గుర్తు తెలియని వ్యక్తులు హైవేపై కంటైనర్ ను ఓవర్ టేక్ చేసి డ్రైవర్ పై దాడి చేశారు. కంటైనర్ ను హైజాక్ చేసి హైవేపై కొద్ది దూరం ప్రయా ణం చేశారు. అనంతరం కంటైనర్ లోని రూ.6 కోట్ల విలువైన సెల్ ఫోన్స్ ను చోరీ చేసి వాహనాన్ని డ్రైవర్ కు అప్ప గించి ఉడాయించారు. ఉత్తర భారత దేశానికి చెందిన దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సీరియస్ ఇష్యూగా తీసుకున్న కోలార్ ఎస్పీ వీరిని పట్టుకు నేందుకు ప్రత్యేక పోలీసు టీం లను ఏర్పాటు చేశారు.అయితే ఇది కంజర్ భట్ ముఠా పనేనని కొలార్ పోలీసులు అనుమానిస్తున్నారు.