నెల్లూరు
స్థానిక మనుమసిద్ధి నగర్ ప్రాంతంలో ఉన్న పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో బ్రాహ్మణ భవన సముదాయాలకు శ్రీ శ్రీ శ్రీ పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి వారి స్వహస్తాలతో వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం ఈనెల 13న నిర్వహించబడుతుందని బ్రాహ్మణ సేవా సంఘాల సమితి పేర్కొంది. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ భవన సముదాయ నిర్మాణానికి జిల్లాలోని బ్రాహ్మణ సేవా సంఘాలు మరియు బ్రాహ్మణులు ఐక్యత గా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు పరిశ్రమల శాఖ మాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు పి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ నియోజవర్గ యూత్ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. బ్రాహ్మణ భవన శంకుస్థాపన కార్యక్రమం పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కి రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులు, జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లా మహిళా విభాగం సభ్యులు, జిల్లా అర్చక సమాఖ్య సభ్యులు, జిల్లా అర్చక పురోహిత విభాగ కార్యవర్గ సభ్యులు, జిల్లా యువజన విభాగ కార్యవర్గ సభ్యులు, నెల్లూరు నగర యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, బ్రాహ్మణ అనుబంధ సంఘాల సభ్యులు మరియు సానిక బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమితి జిల్లా అధ్యక్షులు గుడ్ల దొన వాసుదేవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు కె. పద్మావతి, ఉపాధ్యక్షురాలు ఐ జయలక్ష్మి, కార్యదర్శి జి జయలక్ష్మి, సభ్యులు నాగలక్ష్మి ,నాగజ్యోతి, ప్రతిభ రాణి తదితరులు పాల్గొన్నారు.