నూర్ భాషా కులానికి చెందిన షేక్ అలీషా మృతికి కారణమైన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బట్రూ పాలెంలో ఎక్సైజ్ సి. ఐ. కొండా రెడ్డి ని వెంటనే సస్పెండ్ చేసి, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా/దూదేకుల బి. సి. ముస్లిం సంక్షేమ సంఘం,నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు షేక్ సలీం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక శాంతి నగర్ లోని ఆ సంఘ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలీషా నిర్వహిస్తున్న డాబా వద్దకు వెళ్లి పలుమార్లు నగదు డిమాండ్ చేయడం తనకు తోచింది , ఇచ్చిన పెద్ద మొత్తంలో సి ఐ డిమాండ్ చేయడంతో తాను ఇవ్వలేనని చెప్పినందుకు, అతనినీ జీవుల్లో ఎక్కించుకొని దారుణంగా కొట్టి చిత్రహింసలు చేశారని ఆయన ఆరోపించారు. అలాగే ముందుగానే సి. ఐ. పక్క రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలు జీపులో పెట్టుకుని ఇవి తనవెనని ఒప్పుకో మంటు ఆలీషా రెండుకాళ్ళ పై వాహనాన్ని ఎక్కించడం ఆటవిక చర్యగా ఆయన పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు అతను మృతి చెందారని ఆయన అన్నారు.ఆ కుటుంబానికి అలీషా ఒక్కడే జీవనాధారం అని ,అతని మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారంతో పాటు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించి, న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ,రాష్ట్ర హోం శాఖ మంత్రి ఈ ఘటనపై, పూర్తిస్థాయిలో ఆలీ భాషా ది ఎక్సైజ్ శాఖ చేసిన హత్యనా, లేక అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు ఎక్సైజ్ శాఖ సీఐ కొండారెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాదర్ బాషా , బాబర్ జాన్ , మహబూబ్ బాషా , మస్తాన్ వలి , లతీఫ్ ,హుస్సేన్ సాహెబ్ , ఖాజావళీ , షేక్ మస్తాన్ సాహెబ్ , షేక్ మస్తాన్ , షేక్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.