YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

200 మంది చేనేత కుటుంబాలకు బిజెపి మహిళా మోర్చా చేయూత

200 మంది చేనేత కుటుంబాలకు బిజెపి మహిళా మోర్చా  చేయూత

నెల్లూరు
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పరిధిలోని పాటూరు గ్రామంలో గుర్తించబడిన నిరుపేద చేనేత కుటుంబాల వారికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యవర్గ నెల్లూరు శాఖ తన సహకారం అందించింది . ఈ సందర్భంగా ఖాదీ పంచెలు , వివిధ రకాల పండ్లు బిస్కెట్ ప్యాకెట్ లను అందజేశారు . ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి పాటూరు గ్రామంలోని సుమారు 2 వందల పైచిలుకు చేనేత కుటుంబాల వారిని ప్రత్యేకంగా సందర్శించి , వారి కుటుంబ ఆర్థిక స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మా చేనేతే.. మా ప్రతిష్ట.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతదేశ  ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ  ఆదేశాలతో,రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి, జాతీయ,రాష్ట్ర. మహిళా మోర్చా అధ్యక్షులు  నిర్మలా కిశోర్ తదితరుల  పిలుపుతో, జిల్లా అధ్యక్షులు  భరత్ కుమార్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షులు రాజేశ్వరి. కండికట్ల.  ఆధ్వర్యంలో, శనివారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో నెల్లూరు జిల్లా మహిళా మోర్చా టీమ్ పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు . ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మగ్గాల పనులు లేక, గ్రామాల్లో ఇతర పనులు చేయలేక , ఆరోగ్యం సరిగలేక నేత మగ్గం పని చేయలేక,ఉన్నటువంటి పెద్దలకు,ఖాదీ పంచలు, పండ్లు, బిస్కెట్లు. పంచి చిరు సన్మానం  చేయడం ,మహిళా చేనేత కార్మికురాలిని, ప్రత్యేకంగా సన్మానించడం ఆనందదాయకం అన్నారు . ప్రభుత్వం ప్రకటించిన చేనేత అభివృద్ధి సంక్షేమ పథకాలను త్వరితగతిన విడుదల చేసి  కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షులు జి విజయ శ్రీ , కె సుభాషిని, ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీ ప్రసన్న, కార్యదర్శి నాగవేణి, బి లక్ష్మీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవి మరియు స్థానిక చేనేత కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts