YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చేనేతకు చేయూత టీఆర్‌ఎస్‌ పాలనలో కార్మికులకు మంచి రోజులు

చేనేతకు చేయూత టీఆర్‌ఎస్‌ పాలనలో కార్మికులకు మంచి రోజులు

చేనేతకు చేయూత టీఆర్‌ఎస్‌ పాలనలో కార్మికులకు మంచి రోజులు
నేతన్నల భవిష్యత్‌కు భరోసానిస్తున్న పథకాలు
నూలు, రంగులు, రసాయనాల పై సబ్సిడీ
నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్న చేనేత కార్మికులు
నేడు జాతీయ చేనేత దినోత్సవం
జగిత్యాల ఆగస్టు 07
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు వస్త్రాలు పెట్టి సన్మానించారు అనంతరం వారితో కలిసి సహపంక్తి అల్పాహారం చేశారు....
ఈసందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ..
అగ్గిపెట్టెలో ఇమడగల చీరను తయారు చేసి దేశం పేరును ఖండాంతరాలకు ఎలుగెత్తి చాటిన ఘనత చేనేత కార్మికులకే దక్కుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మగువల మనసును దోచే చీరలను నేయడంలో వారికెవరూ సాటిలేరని, చేనేత వస్త్రాల తయారీకి కేటిఆర్ అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో  పుట్టినిల్లు. ఏండ్ల తరబడిగా మగ్గాలపై వివిధ ఆకృతులు, డిజైన్లతో తయారుచేసిన చీరలు దేశ నలుమూలలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. శుభకార్యాల సందర్భంగా మహిళలు చేనేత చీరలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.  నేత కార్మికులు  నేసిన వస్త్రాలకు ఆదరణ తగ్గిపోవడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చతికిలబడ్డ చేనేత పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నేత కార్మికులకు జీవం పోస్తుందని అన్నారు. ప్రభుత్వం  బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్‌లో ‘నేతన్నకు చేయూత’ పథకానికి రూ.338కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో మరో రూ.30కోట్లను ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో నేతన్నలు ఆనందం వ్యక్తచేస్తున్నారు. 2010 నుంచి కార్మికులు తీసుకున్న వ్యక్తిగత రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, ప్రభుత్వం నాలుగేండ్లుగా తెలంగాణలో చేనేత వస్ర్తాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదని, చేనేత వస్ర్తాలు, పరిశ్రమల గురించి అవగాహన కల్పిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా చేనేత వస్ర్తాలనే ధరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. జౌళి శాఖ మంత్రి  కేటీఆర్ సూచన మేరకు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు దరిస్తున్నామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత వస్ర్తాలకు గిరాకీ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్ర దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి.  నేతన్నల కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌ అందిస్తున్నదని, నూలు, రంగులు, రసాయనాలపై సబ్సిడీ అధిస్తుందని సూచించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లు టెస్కో ద్వారా చేనేత పెన్షన్ 2016,105 లబ్ధిదారులకు అందిస్తున్నమని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
 చేనేత హస్త కళ అద్భుత కళ అని, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలని అన్నారు. ఈ సమాజానికి సంస్కృతిని నేర్పిన నేర్పరులు నేతన్నలని పేర్కొన్నారు. గతంలో ప్రజలకు చేతితో నేసిన వస్త్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవని, అయితే క్రమంగా క్రమంగా యంత్రాలు ప్రవేశించాయన్నారు. దీంతో చేనేత కార్మికులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయని చెప్పారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఒక్కోరంగాన్ని బలోపేతం చేస్తున్నది. సాగు నీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని పండుగలా చేసింది. వృత్తి కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ గ్రామాల్లో వెలుగులు నింపారు. వ్యవసాయ రంగం తరువాత రెండో అతి పెద్ద ఉపాధి రంగంగా ఉన్న చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు కొత్త పథకాలతో కార్మికులకు బతుకు భరోసా కల్పిస్తోంది. చేనేత కార్మికులకు ‘నేతన్నకు చేయూత’ పథకం, చేనేత మిత్ర (త్రిఫ్ట్‌ఫండ్‌), నూలుపై సబ్సిడీ, రుణాలు వంటి పథకాలతో పరిశ్రమను ప్రగతి బాటలో నడిపించేందుకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ కొన్నేండ్లుగా తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో చేనేత సహకార సంఘాలు చురుగ్గా పని చేస్తున్నాయి. స్వయంగా చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్‌ సొసైటీని సందర్శించి కార్మికులతో చర్చించి భవిష్యత్‌ బాగుకోసం అనేక పథకాలకు రూపకల్పన చేశారు. జగిత్యాల పట్టణ చేనేత సహకార సంఘం  అభివృద్ది కి తమవంతు కృషిచేస్తామన్నారు, పవర్ లూమ్స్ ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అడువాల జ్యోతి, దాసరి లావణ్య, హనుమండ్ల జయశ్రీ, అల్లే గంగసాగర్, క్యాదాసు నవీన్, పొపా అధ్యక్షుడు AvN రాజు, కార్యదర్శి రాజేష్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు సిరిపూరపు రాజలింగం, పట్టణ ప్రధాన కార్యదర్శి భోగ గంగాధర్(జి.ఆర్),
జిల్లా ప్రధాన కార్యదర్శి చేటపెళ్లి సుధాకర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, వస్త్ర వ్యాపారం సంఘం కార్యదర్శి గౌరి శ్రీను , మాజీ అధ్యక్షుడు జెడి, జయంత్, సంఘం డైరెక్టర్లు,  కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు...

Related Posts