YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వి.ఎల్.ఎస్.ఐ తో తెలంగాణ యువత భవిష్యత్ బంగారం  వి.ఎల్.ఎస్.ఐ శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో వక్తలు

వి.ఎల్.ఎస్.ఐ తో తెలంగాణ యువత భవిష్యత్ బంగారం  వి.ఎల్.ఎస్.ఐ శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో వక్తలు

వి.ఎల్.ఎస్.ఐ తో తెలంగాణ యువత భవిష్యత్ బంగారం
       వి.ఎల్.ఎస్.ఐ శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో వక్తలు
హైదరాబాద్ ఆగష్టు 7
ఇంజనీరింగ్ స్థాయిలో వి.ఎల్.ఎస్.ఐలో ప్రావిణ్యం సంపాదించిన విద్యార్థుల భవిష్యత్ బంగారముగా మారనుందని వ్యక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2025 సంతవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదిపత్యం సంపాదిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోని ఫొటానిక్స్ వాలి, టాస్క్, టి-సాట్ నెట్వర్క్ మరియు వేదా ఐఐటి సంయుక్తంగా శనివారం నిర్వహించిన 14 రోజుల మొదటి విడత వి.ఎల్.ఎస్.ఐ శిక్షణా కార్యక్రమం టి-సాట్ కార్యాలయంలో జరిగిన ముగింపు సమావేశంలో సంస్థల ప్రతినిధులు మాదవ్, శ్రీకాంత్ సిన్హా, ఆర్.శైలేష్ రెడ్డి, దశరథ గూడే, సుబ్బరంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొటానిక్స్ వాలి సీఈవో మాధవ్ మాట్లాడుతూ సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ 14 రోజుల ప్రసారాలపై అవగాహన పెంచుకోవడం సంతృప్తి నిస్తోందన్నారు. గత పక్షం రోజుల్లో 23 వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా 58,523 వ్యూస్,  యాప్ లో 46,676, కొత్తగా 3,904, రిటర్న్ 19,046, యూనిక్వీన్ యూజర్స్ 22,950 లభించడం పట్ల తాము చేపట్టిన తొలి ప్రయత్నం విజయవంతం అయిందన్నారు. వి.ఎల్.ఎస్.ఐలో నైపుణ్యం సాధించిన విద్యార్థులు మూడు ప్రధాన అంశాలపై పట్టు సాధించగల సామర్థ్యం పెరిగి భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇందులో ప్రావిణ్యం సంపాదించిన విద్యార్థి ఉద్యోగం సంపాదించడం, పారిశ్రామిక రంగంపై దృష్టి, సమీకృత వ్యాపారంపై అవగాహన పెంచుకోవడం వంటి ప్రధాన అంశాలలో అనుభవం సాధిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ యువత కేవలం ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా వృత్తి నైపుణ్యంలోనూ రాణించాలని సూచించారు. టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే వి.ఎల్.ఎస్.ఐ అవగాహన కార్యక్రమాలను టి-సాట్ నెట్వర్క్ లోని టెలివిజన్ ఛానళ్లు, ఫేస్ బుక్, యూట్యూబ్, యాప్ ద్వార మారుమూల ప్రాంతాల యువత, విద్యార్థులకు అందించగలిగామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే ఇలాంటి సౌకర్యాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  వేదా ఐఐటి ఛైర్మన్ దశరథ గూడే మాట్లాడుతూ వి.ఎల్.ఎస్.ఐ పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం  వేదాకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. డైరెక్టర్ సుబ్బరంగయ్య మాట్లాడుతూ ఇంటనీరింగ్ విద్యార్థులు పట్టబద్రులమయ్యామని భావించకుండా అందులో ఎంత వరకు పరిపూర్ణత సాధించామో అంచనా వేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని రెండవ విడత అవగాహన పాఠ్యాంశాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Related Posts