YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిరూపిస్తే రాజీనామా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నిరూపిస్తే రాజీనామా   వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

 క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకున్నా నా ప్రోద్బలం  ఉంటుంది. రాజకీయ కక్షతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రతిష్ట తీయలనుకుంటే ఒప్పుకొమని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  క్రికెట్ బుకీలకు మద్దతుగా నేను పోలీసులకు ఫోన్ చేశానని ఆరోపిస్తున్నారు.  నేను ఎవరికి ఫోన్ చేసానో ఆ అధికారుల పేర్లు ఎందుకు ఎస్పీ బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.  క్రికెట్ బుకీలు కాల్ డేటాను పరిశీలించి వారు ఏ మంత్రులు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నారో పరిశీలించి వారికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని అన్నారు. బుకీలు మంత్రులకు సన్మానాలు చేశారు, ఫ్లెక్స్ లు కట్టారు, దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీసారు.  ఏఎస్పీ కారు డ్రైవర్ కాల్పుల్లో మృతి చెందితే దానిపై ఎందుకు ఎస్పీ లోతుగా విచారణ చేయడం లేదు.  ఎస్పీగా మీ బాసిజం దిక్కరించానని నా పై కేసులు పెడుతారా అని ప్రశ్నించారు.  కృష్ణ సింగ్ అనే బుకీతో నేను విజయవాడ హోటల్, కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నేను ఉన్నట్లు సీసీ ఫుటేజ్ బయట పెట్టండని డిమాండ్ చేసారు. అది నిరూపిస్తే గంటలో నా పదవికి రాజీనామా చేస్తా.  ఎస్పీ గారికి రిజిస్టర్ పోస్టు ద్వారా పై విషయాలన్నీ పంపుతున్నానని అయన వెల్లడించారు. 

Related Posts