YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎయిడెడ్.... ఆర్డినెన్స్ రిలీజ్ చేసిన సర్కార్

ఎయిడెడ్.... ఆర్డినెన్స్ రిలీజ్ చేసిన సర్కార్

విజయవాడ, ఆగస్టు 9, 
విద్య వ్యవస్థలో 'ఎయిడెడ్‌' శకం ముగుస్తోంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మూసివేసేందుకు కావాల్సిన అధికారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీనిలో భాగంగానే ఈ విద్యాసంస్థలకు అందించే సాయాన్ని నిలుపుదల చేసి, సిబ్బందిని వెనక్కు తీసుకోనుంది. దీంతో ఏళ్ల చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం నెలకొంది. విద్యాసంస్థలకు ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వాలని, లేదంటే ప్రైవేట్‌ యాజమాన్యాల కింద నిర్వహించుకోవాలని ఎయిడెడ్‌ యాజమాన్యాలకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. దీంతో ప్రైవేట్‌గానే ఉంటామని ఎక్కువ శాతం యాజమాన్యాలు చెప్పాయి. తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్‌లో ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు, ప్రభుత్వ సిబ్బందిని వెనక్కి తీసుకోనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారనుంది. రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 4.80లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. 1972 పాఠశాలల్లో 1,97,291 మంది విద్యార్ధులు, 120 జూనియర్‌ కళాశాలల్లో 31వేల మంది, 137 డిగ్రీ కళాశాలల్లో 2.50లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఈ విద్యార్ధులందరినీ ఎక్కడ చేర్చాలి, వాళ్ల పరిస్థితి ఏంటనే దానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఇప్పటికే ఎయిడెడ్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లను ప్రభుత్వం నిలిపేసింది.ఎయిడెడ్‌ పాఠశాల సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల్లో కలపడం వల్ల నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 1972 పాఠశాలల్లో సుమారు 11వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయడం వల్ల కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఉండవని ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts