YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అన్నీ..తానై సజ్జల....

అన్నీ..తానై సజ్జల....

విజయవాడ, ఆగస్టు 9, 
ప్రాంతీయ పార్టీలో సహజంగా అధినేత మోనార్క్. ఆయన చెప్పినట్లే నడుచుకోవాలి. నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే కొనసాగుతాయి. ప్రజాస్వామ్య పద్థతుల్లో, అందరి ఆమోదయోగ్యంతో నిర్ణయం తీసుకున్నామని ఎవరు చెప్పినా అది బుల్ షిట్. దానిని నమ్మే ఛాన్సే లేదు. చంద్రబాబు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ముందే డిసైడ్ అయి దానిని పొలిట్ బ్యూరోలో పెట్టి చర్చించామని చెప్పి మమ అనిపిస్తారు. బయటకు తాము అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయించామన్న బిల్డప్ కోసం. కానీ జగన్ ఆ బిల్డప్ ల కోసం కూడా పాకులాడటం లేదు.ఏ నిర్ణయమైనా తనదేనని జగన్ అందరికీ చెబుతున్నారు. ఒక జిల్లాలో నేతకు లేదా నియోజకవర్గంలో నేతకు పదవి ఇవ్వాలన్నా ఆ ఎమ్మెల్యేతో సంప్రదించే సంప్రదాయం వైసీపీలో కొరవడింది. ఇక ఎంపీల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వారికే తెలయని పరిస్థితి. నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు మొత్తు కుంటున్నా వాటిని పట్టించుకోవడం లేదు.ఇప్పుడు వైసీపీలోనూ, ప్రభుత్వంలోనూ ఏం జరిగినా అది జగన్ ఆదేశంతో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమలుపరుస్తారు. జగన్ నేరుగా రంగంలోకి దిగకుండా సజ్జలను తన వాయిస్ గా ఉపయోగించుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీల ఖరారు వంటి విషయాల్లో జగన్ ఎక్కువగా సజ్జల మీదనే ఆధారపడతారంటారు. ఆయన నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తారు.ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా మారారు. జగన్ తర్వాత స్థానం ఆయనదేనని చెప్పక తప్పదు. అందుకే మంత్రులతో సహా సజ్జల దర్శనం కోసం కూడా పడిగాపులు కాస్తుండటం విశేషం. జగన్ గట్టిగా నమ్మేది ఎవరినీ అంటే సజ్జల అని పార్టీలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. అంటే ప్రభుత్వం కేవలం సజ్జల చెప్పినట్లే నడుస్తుందని చెప్పక తప్పదు. అందుకే విపక్షాలు సజ్జలను టార్గెట్ చేశాయి. జగన్ మాత్రం మిగిలిన నేతలందరినీ డమ్మీలను చేసి సజ్జల చేత కథంతా నడిపిస్తున్నారు.

Related Posts